Pink Colored Water: ఆ ఊరిలో వింత ఘటన.. బోరు బావి నుంచి వస్తోన్న గులాబీ రంగు నీళ్లు

దేవుని మాయ.. విష ప్రభావమా అంటూ స్థానికుల ఆందోళన

Share this :

Pink colored water హైదరాబాద్, డిసెంబర్ 12: మంచిర్యాల జిల్లా (Manchiryala district) చెన్నూరులో వింత ఘటన చోటు చేసుకుంది. చెన్నూరు (chennur)పట్టణంలోని కొత్తగూడెం కాలనీకి చెందిన కట్ట శ్రీనివాసాచారి అనే వ్యక్తి ఓ ఇంట్లోని బోర్ (borewell) నుంచి గులాబీ రంగులో నీళ్లు (Pink colored water) రావడం ఆందోళనకు కారణమైంది. నిన్న రాత్రి వరకు స్వచ్చమైన నీటిని (water) అందించిన కట్ట శ్రీనివాసాచారి బోరు.. ఒక్కసారిగా ఉదయం గులాబీ రంటు నీటి దారతో దర్శనం ఇవ్వడంతో చారి కుటుంబ సభ్యులు విస్తు పోయారు. ఏకబిగువునా బోరు నుంచి గులాబీ రంగులో నీళ్లు రావడంతో భయబ్రాంతులకు‌ గురైన ఇంటి యజమాని శ్రీనివాస్ స్థానికులకు సమాచారం ఇవ్వడంతో గులాబీ రంగు నీటి విషయం చెన్నూరు అంతా దావానంలా వ్యాపించింది.

దీంతో గులాబీ రంగు నీటిని చూసేందుకు స్థానికులు కట్ట శ్రీనివాస్ ఇంటికి క్యూ కట్టారు. అయితే ఈ గులాబీ నీటి‌దారకు కారణాలేంటి.. నీరు విష తుల్యం కావడం కారణంగానే ఇలా జరిగిందా? లేక మరేదైనా కారణముందా అని ఆ కాలనీ వాసులు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. కట్ట శ్రీనివాస్ బోరు నుంచి గులాబీ రంగు నీళ్లు రావడంతో ఆ ఇంటి పక్కనే ఉన్న కాలనీ వాసులు తమ బోరు‌నుంచి కూడా అలాంటి నీళ్లే వస్తున్నాయేమో అని పరీక్షించారు. అయితే కేవలం ఆ ఒక్క‌ఇంటి బోర్ నుండే గులాబీ రంగు నీరు వస్తుండటంతో ఆ నీరు విషతుల్యమైందని అనుమా‌నాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే అదికారులు ఈ నీటిని పరీక్షించి కారణాలు తెలుసుకోవాలని చెన్నూరు పట్టణ వాసులు కోరుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా మూడు చోట్లలో వెలుగు చూసిన వింత..

అయితే ఇలాంటి ఘటనలు గతంలో ప్రపంచ వ్యాప్తంగా మూడు చోట్ల దర్శనమిచ్చాయి. గుజరాత్‌లోని బనాస్ కంఠ జిల్లా సుయిగామ్ గ్రామ సమీపంలోని ఓ చెరువులో నీళ్ల రంగు సడన్‌గా మారిపోయింది. నీళ్లన్ని గులాబీ రంగులో దర్శనమిచ్చాయి. దాంతో స్థానికులు అది దేవుడి లీలగా బావించి మొక్కులు చెల్లించుకున్నారు‌ కూడా. నిపుణులు మాత్రం ఇది రసాయనిక చర్యగా భావించి.. ఆ నీటిని తాకకూడదంటూ హెచ్చరికలు జారీ చేశారు. మహారాష్ట్రలోను ఇలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది. బుల్దానా జిల్లాలోని లోణార్ చెరువులో నీళ్లు గులాబీ రంగులోకి మారిపోయాయి. ఆ చెరువు ముంబైకి కేవలం ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉండగా… 383 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు గులాబీ రంగులో మారడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. నాగ‌పూర్‌లోని నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధికారులు ఆ చెరువును పరిశోదించి… ఓ రకమైన బాక్టీరియా కారణంగా ఇలా జరిగిందని తేల్చారు.

అటు అమెరికాలోను ఇలాంటి ఘటనే చోటు‌చేసుకుంది. అమెరికాలోని హవాయిలోని ఓ చెరువులో నీళ్లు ఒక్కసారిగా గులాబీ రంగులోకి మారిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన అమెరికాకు చెందిన ‘ఫిష్‌ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ సర్వీస్‌’.. చెరువులో అధిక లవణీయత వల్ల నీళ్లలో ఒకరకమైన బ్యాక్టీరియా కారణంగా నీళ్లు గులాబీ రంగులోకి మారిపోయి ఉంటాయని భావించారు. కరవు కారణంగా జూన్‌ నుంచి చెరువులో నీరు ఆవిరి కావడంవల్ల లవణీయత పెరిగి ఉంటుందని, నీరు విషపూరితం కాలేదని, రంగు మార్పుపై స్పష్టత కోసం నమూనాలు సేకరించి హవాయీ విశ్వవిద్యాలయనికి పంపించామని తెలిపారు. కాగా, ఉన్నట్టుండి చెరువులోని నీళ్లు గులాబీ రంగులో మారడంతో ఆశ్చర్చపోయిన ఓ వ్యక్తి.. డ్రోన్‌ సాయంతో ఆ చెరువు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అప్పట్లో ఆ ఘటన సంచలనంగా మారింది.

అదే కారణమా…?

అయితే ఇలా నీళ్లు గులాబీ రంగులోకి మారడానికి ‘హలోబ్యాక్టీరియా’ కారణమని, ఇది ఏకకణ జీవి అని, దాని పెరుగుదల కారణంగానే నీళ్లు ఇలా గులాబీ రంగులోకి మారుతాయని… ఇవి అధిక లవణీయత పరిస్థితులలో వృద్ధి చెందుతాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అయితే.. ఇది నిజమేనని ధృవీకరించేందుకు DNA పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని.. హలోబ్యాక్టీరియానే కారణమా? కాదా? అన్నది తేల్చాల్సి‌ ఉందని అమెరికా శాస్త్ర వేత్తలు చెపుతున్నారు. చూడాలి అక్కడెక్కడో గులాబీ రంగులోకి మారి ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన ఘటనకు చెన్నూరులో బోర్ నుంచి ఏకదాటిగా గులాబీ దారలా వస్తున్న నీటికి సంబందం ఏదైనా ఉందా..? నిజంగా.. బ్యాక్టీరియా కారణంగానే ఇలా నీరు గులాబీ రంగులోకి మారుతుందా అన్న తేలాల్సి‌ఉంది. అప్పటి వరకు మాత్రం ఆ నీటిని వినియోగించక పోవడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.