ప్లాట్‌ఫామ్ టికెట్ కంటే, ట్రైన్ టికెట్ చౌక..!

భారత తొలి హైడ్రోజన్ రైలును షురూ

Share this :

భారత రైల్వే చరిత్రలో సరికొత్త హరిత విప్లవానికి నాంది పలికారు ప్రధాని నరేంద్ర మోదీ. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ వేదికగా దేశంలోనే మొట్టమొదటి ‘హైడ్రోజన్ ఇంధన‘ రైలును ఆయన శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. పర్యావరణహిత సాంకేతికతతో నడిచే ఈ రైలు కేవలం జీరో—మిషన్ అంటే సున్నా కాలుష్యం మాత్రమే కాకుండా, సాధారణ ప్రయాణికులకు సైతం అందుబాటులో ఉండేలా అత్యంత చౌకైన టికెట్ ధరలతో రాబోతుండటం విశేషం.

Also Read:  తమిళనాడు పాలిటిక్స్‌లో ప్రకంపనలు..!

ఈ హైడ్రోజన్ రైలుకు సంబంధించిన కనీస టికెట్ ధర కేవలం రూ. 5 కాగా, గరిష్ట ధరను రూ. 25 గా నిర్ణయించారు. ప్రస్తుత రోజుల్లో రైల్వే స్టేషన్లలో లభించే ప్లాట్‌ఫామ్ టికెట్ ధర కంటే కూడా ఈ రైలు ప్రయాణ ఛార్జీ తక్కువగా ఉండటం గమనార్హం. హర్యానాలోని జింద్ – సోనిపట్ మధ్య దాదాపు 90 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రయాణం మధ్యతరగతి, రోజువారీ ఉద్యోగులకు భారీ ఆర్థిక ఉపశమనం కలిగించనుంది.

ఈ గ్రీన్ ట్రైన్ ప్రత్యేకత ఏంటంటే, ఇది సాంప్రదాయ విద్యుత్ తీగలు (Overhead Wires) లేదా డీజిల్ ఇంజన్ల అవసరం లేకుండా స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడుస్తుంది. సాధారణ డీజిల్ రైళ్లలాగా ఇది పర్యావరణానికి హాని చేసే కార్బన్ ఉద్గారాలను విడుదల చేయదు. దీని సైలెన్సర్ లేదా ఎగ్జాస్ట్ నుండి పొగకు బదులుగా కేవలం స్వచ్ఛమైన నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. ఈ రైలుకు అవసరమైన గ్రీన్ హైడ్రోజన్‌ను సరఫరా చేయడం కోసం జింద్‌లోనే ప్రత్యేక ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేశారు.

Also Read: పలాస హిట్ అండ్ రన్ కేసు.. అప్పలరాజు అరెస్ట్ కు సిద్దం..?

ఈ 10-కోచ్‌ల రైలు రోజుకు దాదాపు 2,600 మంది ప్రయాణికులను చేరవేస్తూ, రూట్‌లో 11 చోట్ల హాల్టింగ్ సౌకర్యం కలిగి ఉంటుంది. ఇప్పటివరకు జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే పరీక్షించిన ఈ హైడ్రోజన్ రైలు సాంకేతికతను ఇప్పుడు భారత్ విజయవంతంగా అందుబాటులోకి తెచ్చింది. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ ప్రాజెక్టును ‘ఆత్మనిర్భర్ భారత్’ మరియు ‘వికసిత్ భారత్’ దిశగా పడిన చారిత్రాత్మక అడుగుగా అభివర్ణించారు.

leave a reply