తెలుగు డిజిటల్ మీడియా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను రూపొందించుకొని శిఖరాగ్రం చేరి.. పయనిస్తున్న సుమన్ టీవీని హైదరాబాద్ కేంద్రంగా ఓ యూట్యూబ్ ఛానెల్ మక్కీకి మక్కీ కాపీ కొడుతోంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి చేరువైన ఫేస్ బుక్ పేజీల ఫ్రేమ్స్ ను, టైటిల్ టెక్స్ట్, కలర్స్ ను గత పది రోజులుగా ఆ యూట్యూబ్ ఛానల్ ఫేస్ బుక్ పేజీల్లో మక్కీకి మక్కీ కాపీ కొడుతూ సుమన్ టీవీ ప్రేక్షకులను తికమక పెడుతోంది. కొంత మంది ఆ యూట్యూబ్ ఛానెల్ ని సుమన్ టీవీ కొనేసిందా? అని డిజిటల్ మీడియా సర్కిల్ లో చర్చ జరుగుతోంది. మన తెలుగులో ప్రముఖ డిజిటల్ ఛానెల్స్ ఉన్నప్పటికీ.. అవి వాటి లోగోస్, కలర్స్, ఫ్రేమ్స్, ఫాంట్స్ తో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. తెలుగులో డిజిటల్ మీడియాలో మ్యాంగో మీడియా, తామడా మీడియా, తొలి వెలుగు, ఆర్ టీవీ డిజిటల్ మీడియా, యోయో,తెలుగు వన్, ఐ డ్రీమ్స్, ఆదాన్, తెలుగు పాపులర్ టీవీ,క్యూబ్ టీవీ, టాప్ తెలుగు టీవీ, డయల్ న్యూస్, కావ్యాస్ మీడియా,TV 24 స్టూడియో, , సోషియల్ పోస్ట్ తదితర మరిన్ని ఛానెల్స్ తమ ప్రత్యేక సిగ్నేచర్ తో కోట్ల మంది తెలుగు వ్యూయర్స్ కు చేరువైయ్యాయి.
Also Read : టీడీపీలోకి మేడా మల్లికార్జున రెడ్డి?
యూట్యూబ్ ఛానల్ నడిపేందుకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ..లక్షల్లో జీతాలు ఇస్తూ ఇతర ఛానెల్స్ ను అనుసరిస్తూ, అనుకరిస్తూ.. ఇతరులను ప్రభావితం చెయ్యలేం. ఇతర ఛానెల్స్ మెటీరియల్ ను కబ్జా చేసి వీక్షకుల మన్ననలు పొందలేం.
Also Read : YSRCP గెలిచే సీట్లు 18 నుంచి 20 మాత్రమే
రాబోయే రోజుల్లో ట్రేడ్ మార్క్, కాపీ రైట్స్:
రాబోయే రోజుల్లో యూట్యూబ్ ఛానెల్స్ సైతం ట్రేడ్ మార్క్, వారు సొంతంగా రూపొందించుకొన్న ఏదైనా మెటీరియల్ ను కాపీ రైట్స్ పొందవచ్చు. సుమన్ టీవి ప్రభుత్వ ట్రేడ్ మార్క్ ను పొంది వుంది. వారి ఫేస్ బుక్ పేజీల ఫ్రేమ్స్ కూడా కాపీ రైట్స్ పొందినట్లు సమాచారం. భవిష్యత్ లో డిజిటల్ ఛానెల్స్ కూడా తమ ఇంటి లెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కాపాడుకోనేందుకు ప్రయత్నించవచ్చు. లీగల్ నోటీసులు పంపవచ్చు. నష్ట పరిహారం కోరవచ్చు
