ఖమేనీ అంత్యక్రియల్లో భారత్.. ట్రంప్ కు బిగ్ షాక్..!

ఇరాన్ తో స్నేహం ముఖ్యమన్న భారత్

Share this :

అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కన్నుమూసిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియల కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక వీడ్కోలు వేడుకలో పాల్గొనేందుకు భారతదేశానికి చెందిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం నేడు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు బయలుదేరింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ ప్రతినిధుల బృందంలో బిహార్ గవర్నర్‌తో పాటు, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రముఖులు ఈ అంత్యక్రియలకు హాజరవుతుండటంతో, భారత్ తరఫున దౌత్యపరమైన సంఘీభావాన్ని వ్యక్తంచేసేందుకు ఈ బృందం టెహ్రాన్ చేరుకోనుంది.

Also Read: అశ్విన్ సరికొత్త అవతారం.!

ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ వైమానిక దాడుల్లో ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరాన్ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల కారణంగా మార్చిలో జరగాల్సిన ఈ అంత్యక్రియలను ఇరాన్ ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. దాదాపు 120 రోజుల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం, అమెరికాతో తాత్కాలిక ఒప్పందం కుదిరి పరిస్థితులు కాస్త కుదుటపడటంతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఇప్పుడు ఈ అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

Also Read: టెక్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డీల్.. మైక్రోసాఫ్ట్, టాటా సబ్‌మెరైన్ కేబుల్..!

ఇరాన్ అధికారిక షెడ్యూల్ ప్రకారం.. ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనలు మరియు వీడ్కోలు కార్యక్రమాలు జూలై 4 నుండి ప్రారంభమై జూలై 9 వరకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఘనంగా జరగనున్నాయి. జూలై 4, 5 తేదీల్లో టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని ప్రార్థనా మైదానంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. జూలై 6న టెహ్రాన్ వీధుల్లోనూ, జూలై 7న పవిత్ర నగరం కోమ్ లోనూ భారీ శోభాయాత్రలు నిర్వహిస్తారు. చివరగా జూలై 9న ఖమేనీ సొంత నగరమైన మషద్‌లోని చారిత్రాత్మక ఇమామ్ రెజా పుణ్యక్షేత్రంలో ఆయన భౌతికకాయాన్ని శాస్త్రోక్తంగా ఖననం చేయనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు.