పా….తది ఉండ్లా లబ్బర్ ది… అది తీస్కోని కొడ్తా… ఏందేందో మాట్టాడతాండవు రేయ్… నేనేమన్నా తాత
యేం తాతో ముసిలోల్లు అంతా చెట్టు కాడికి సేర్నారు… ఏందో భలే మాట్టాడతా ఉండారు…
ఏం… ల్యా లే… రా రాబ్బీ…
సెప్పు ముసిలోడా… భలే గెట్టిగా మాట్టాడతాండరంత…
ఏం లేదు లే ప్పా… రాట్టంలో లీడల్ల మాటలు ఇంటాంటే ఈల్లేం మనుసులు రా సామి అనిపిచ్చాంది ప్పా… ఈల్లు ఏం తింటాండరో అత్తం కాలా??? అని జనాలు అబ్బా భలే తిడతాండరు…
ఏం మాట తాత…దేని మింద ఓరు మాట్టాడినారు… భలే కోపంగా ఉండావే…
రాట్టం బాగా అభివుద్ది కావాల్నెంటే మూడు ఆజధానులు కావాలని రాట్ట పెద్ద మనిసి సెప్నాడు…
మూడు ఆజధానులు ఉంటే అంత అభివుద్ది ఐతాదా… అని అంతా పెశ్నలు ఎస్సాండరు…
ఐనా తాత మూడు ఆజధానుల తో కొన్ని దేశాలు సంక నాకిపోయినాయి అంటాండరు కదా తాత…
ఔను… అబ్బీ… నిజమే…
ఈడ ఒక దానికి దిక్కు ల్యాకుండా పోయింది… మూడంట… మూడు… ఏం సెప్తావ్ ఈళ్ళ కథలు… అని గుసగుసలు ఆడతాండరు…
ఎంటియయి… తాత… ఉండాయిలే ఎవురికి ఓళ్ళు చెప్పు కున్నేటియి…
రాట్టం మొదులు పెట్నేపుడు కమరావతి ఆజధాని అని సెప్నారు… మళ్ళ పెభుత్వం మార్తానే మూడు సేస్సాండం అని సెప్నారు…
రెండోది బిసాక, మూడోది పన్నూలు పెడ్తాండమని సెప్నారు…
కమరావతిలో ముందున్నోల్లు కట్న బిల్లింగులు తప్ప ఈల్లేమి కట్లా… ఇంగ ఈడ్నే ఉంటా పరిపాలిచ్చానే ఉండారు…
బిసాకకు పోయి ఆడ్నున్చే పాలిచ్చేచ్చాం అని పెభుత్వ పెద్దోళ్ళు సెప్తాంటే మాకు ఆజధాని వద్దు రా సామి అని బిసాకొల్లు నెత్తి నోళ్లు కొట్టుకుంటాండరు… ఆడ ఒకటో రెండో బిల్లుంగులు కట్నారు…
ఈ పన్నూలో మూడో ఆజధాని అని సెప్పి ఇంత దాకా పలకలా… ఈడ ఇన్గా ఏం పెట్లేదే… అని ఈడుండే టోల్లు యగమల్లుకొని… కప్పల మాదిరి నోళ్లు తెరుసుకొని పెద్ద కండ్లు సేస్కుని సూస్సాండరు…
బైట మీ రాట్టానికి ఆజధాని ఏంది రా అంటే ఏం జెప్పాలో దిక్కు తెలీక లీడల్లు, జనాలు జుట్లు పెరుక్కుంటాండరు…
అంతా ఉండే ఆజధానిని ఇట్టా గబ్బు పట్టిచ్చి ఇప్డు లీడల్లు నోటి కొచ్చినట్లు మాట్టాడతాండరు…
ఈళ్లు యిగ్గు, రెగ్గు ల్యాకుండా ఎందెందో మాట్టాడ తాండ్రని జనం నోటికొచ్చినట్టు అమ్మనా బూతులు తిడతాండరు రా అబ్బీ…
సోలవరం ఎప్పుడు కడ్తారో ఏమో నాకే తెలీదు, నోటితో కామసేద్యం చేసే ఆయప్ప కమరావతే ఆజధాని అంటాండడు…
ఈయనకు ఏం సెప్పాలో దిక్కు తెలీక, మొత్తానికి కమరావతి ఆజధాని అని నిజం ఒప్పేసుకున్యాడు…
ఇంగో ఆయప్ప ఆజధాని బువ్వ పెడతాదా అని కొట్టే వోని మాదిరి పేశ్నలు ఎస్సాండడు…
రాట్టానికి ఆజధాని గుండెకాయ మాదిరి. దానికి సూట్టూ ఫ్యాట్రీలు వచ్చా ఉంటాయి… మంచి ఆస్పత్రు లోచ్చాయి…
పది మంది బీదోల్లకు పని దొరుకుతాది… లచ్చల్ మంది బతుకుతారు… ఈనెవడో ఆజధాని బువ్వ పెడతాదా అంటే ఈయప్పను ఏం సేయాల… ఈల్ల ఊరోల్లకు ఏం ఖర్మ వొచ్చింది రా సామి…
మనూళ్లో ఐతే తాత ఊరంత తిప్పి తిప్పి కొడతారు ఊరోళ్ళు… ఏమీ అనల్యాక,
ఏమనాల్నో జనానికి అత్తం కాక గోడకు బట్టి తలకాయలు కొట్టు కుంటాండరు…
ఇంగోకాయప్పకు ఇప్పుడు పాత ఆజధాని సైదరాబాదు కావాలంట ప్పా… పెత్యేక హోదా యాడికి పోయిందో ఒకరు సెప్పడం ల్యా… పలకడం ల్యా…
కేంధం కాడికి పోయి మళ్ళా సైదరాబాదు ను ఆజధాని సేయాలని అడుగుతా అంటాండడు ఈయప్ప…
అదెందో మింగల్యాక మంగలారం అన్యాడంట ఇట్టా ఆయప్ప ఓరో ముందు…
ఈ పెద్ద మనుసులకు తలకాయలు ఉండాయా ఓరికన్నా బాడిక్కిచ్చినారో అత్తం కాలా… తలకాయ పగిలిపోతాంది…
అబ్బా… ఈల్లను ఏమనాల తాత… ఎక్కల్యాక మంగాలారం అనేటోళ్లు ఈల్లు..
కేంధం ఇప్పుటికే కమరావతే ఆజధాని అని సెప్పినా ఈళ్లు
మాట పట్టింపుల్తో ఏందెందో సెప్పుకుంటా ఉండారు… జనాల్ను పిచ్చోల్లను సేస్సాండరు… ఓరి ఖర్మ వోనోది…
మంది కుచ్చి ఎక్కిచ్చినారు… ఇప్డు ఒళ్లను పట్టించుకోకుండా ఇట్టానుసారం ఎగురు తాండరు…
సంపాయిచ్చి నోటి కొచ్చినట్టు మాట్టాడతా ఉండే ఈల్లకు ఈ సారి కుచ్చి లోంచి దొబ్బేసి కాషాయం గుడ్డలు ఏయించి ఓ పదేండ్లు కాశీలో పని చేయిచ్చాల… తాత…
నిజమే రా …అబ్బీ…
పోయోస్సా తాత… ఇంట్లో కోడి కూర సేసినారు… తినేసి వస్సా…
– సముద్రవాణి
