తమిళనాడులో ప్రస్తుత ప్రభుత్వం కూలిపోతుందంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ ప్రచారాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా ఖండించారు. తమ ప్రభుత్వ భద్రతపై వస్తున్న ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని, ప్రజలు తమకు ఇచ్చిన తీర్పు ప్రకారం పూర్తి కాలం పాటు అధికారంలో విజయవంతంగా కొనసాగుతామని సీఎం విజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థిరత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఈ వ్యాఖ్యలతో ఆయన గట్టి చెక్ పెట్టారు.
తమ ప్రభుత్వ మనుగడ మరియు పరిపాలనా విధానంపై మాట్లాడిన సీఎం విజయ్, తమ పార్టీ మరియు ప్రభుత్వ ఆశయాలను మరోసారి స్పష్టం చేశారు. తమకు రెండు ప్రధాన సిద్ధాంతాలు ఉన్నాయని, అందులో మొదటిది ‘అవినీతి రహిత పాలన’ కాగా, రెండవది ‘లౌకికవాదం’ (Secularism) అని ఆయన ప్రకటించారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని కాపాడటమే తమ లక్ష్యమని సీఎం వివరించారు.
రాజకీయంగా ఎన్ని ఒత్తిడులు ఎదురైనప్పటికీ, పరిపాలన విషయంలో తాము నమ్ముకున్న ఆదర్శాల నుండి వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి విజయ్ స్పష్టం చేసారు. అవినీతిని అంతమొందించడం, రాష్ట్రంలో లౌకిక విలువులను కాపాడటం అనే ఈ రెండు ముఖ్యమైన అంశాల్లో ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వానికి పూర్తి బలం ఉందని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ పాలన సాగుతుందని ఈ సందర్భంగా తమిళనాడు సీఎం శ్రేణులకు మరియు ప్రజలకు భరోసా ఇచ్చారు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి