నారాయణ సహకారం తెలుగుదేశం పార్టీకి ఉండకూడదనేదే జగన్ లక్ష్యం
తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉండడమే నారాయణ చేసిన తప్పా? అని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ప్రశ్నించారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో..
అంతమంది సిబ్బందితో దాడులు చేయడానికి నారాయణ ఏమైనా స్మగ్లరా?
నారాయణ ఇంట్లో దాడులు అమానుషం. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారాయణ ఇంట్లో సోదాలు చేయడం అన్యాయం. వ్యక్తిగత కక్షకు ఇది పరాకాష్ట. మాజీమంత్రి నారాయణపై జగన్ రెడ్డికి ఇంకా పగ తీరినట్టు లేదు. కోర్టు ఉత్తర్వులు లేకుండా 5గురు డీఎస్పీలు, 8 మంది సీఐలు, వంద మంది పోలీసులతో నారాయణ ఇంటిని సోదా చేయడం అక్రమం. ఆయన ఏమైనా స్మగ్లరా? వైసీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తోంది.
ప్రతిపక్ష నాయకులను వేధించడానికి వ్యవస్థల్ని వాడుకుంటున్నారు
ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించడానికి వ్యవస్థల్ని ఒక అస్త్రంగా ప్రభుత్వం వాడుకుంటోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనడానికి నారాయణ ఇంటి సోదాలే నిదర్శనం. ప్రతిపక్ష నాయకులను భయాందోళనలకు గురిచేసేందుకు వ్యవస్థల్ని ఉపయోగించుకుంటున్నారు.
విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచుతున్న నారాయణ
నారాయణ స్కూళ్లు, కాలేజీలు, మెడికల్ కాలేజీలు స్థాపించి మంచి పేరు గడించారు. మంచి విద్యా సంస్థలను స్థాపించి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. కింది నుండి కష్టపడి ఒక ఉన్నతస్థాయికి వచ్చిన వ్యక్తి నారాయణ. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను కాపాడుతూ వస్తున్నారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన పిల్లలకు ఫీజుల్లో రాయితీలిస్తూ విద్యా వ్యాప్తికి ఇతోధికంగా తోడ్పడుతున్నారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి నారాయణ. మంచి వ్యక్తులపైనా మీ దాడులు అని వైసీపీ నాయకులను ప్రశ్నిస్తున్నాను. నారాయణ దాదాపు 2 దశాబ్దాలుగా టీడీపీలో ఉండి చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్నారు. పార్టీ కేడర్ ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఆయన పార్టీకి చాలా సహకరిస్తూ వస్తున్నారు. పార్టీ ప్రతిష్ట కు కృషి చేస్తున్నారు.
మాజీ మంత్రి నారాయణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కక్ష తీరలేదు
అధికారంలోకి వచ్చినప్పటినాటి నుంచి నేటి వరకు ప్రతిపక్ష నేతలపై వేధింపులు కొనసాగిస్తూనే ఉన్నాయి. మొదట నారాయణ విద్యా సంస్థలపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టారు. ఆ తరువాత రాజధానిలో అక్రమంగా భూముల కొనుగోళ్లు అంటూ కేసులు పెట్టారు. ఇవేవీ నిరూపించలేకపోయారు. ఇప్పుడు నారాయణ ఇంటిలోకి వెళ్లి సోదాలు జరిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మాదక ద్రవ్యాల నిరోధక అధికారులు నారాయణ ఇంట్లో ఎలా సోదాలు జరుపుతారు? అధికారులు అక్రమంగా నారాయణ ఇంటిలోకి ఎలా వెళతారు?
జగన్ మాట వింటే అధికారులు బలవక తప్పదు
జగన్ రెడ్డి చెప్పినట్లు అధికారులు వింటే రాబోయే రోజుల్లో అధికారులు బలవక తప్పదు. నారాయణ ఏమైనా తీవ్రవాదా? ఆయన ఇంట్లో సోదాలు జరపాల్సిన అవసరమేంటి? ఇంట్లో అంత కష్టపడి సోదాలు జరిపారు. ఏం దోరికాయో తెలపాలి. నారాయణ నెల్లూరు నుంచి పోటీ చేయబోతున్నాడని ఆయనను ఇప్పటినుంచే భయభ్రాంతానికి గురిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవలేక ఇప్పటి నుంచే ప్రతిపక్ష నేతల్ని బెదిరిస్తున్నారు.
అధికారం కోల్పోతున్నా జగన్ లో ఇంకా మార్పు లేదు
అధికారం కల్పోతున్నా జగన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. నారాయణ భార్యని హౌస్ అరెస్టు చేశారు. నారాయణ ఇంటిలోని మంచాలను ధ్వంసంచేశారు. నారాయణ ఇంటిలో ఎటువంటి మాదకద్రవ్యాలు, ధనం లభిచలేదు, అనవసరంగా దాడులు జరపడం ఎంతవరకు సబబు?
2014 నుండి నెల్లూరును అభివృద్ధి చేసిన వ్యక్తి నారాయణ
2014నుండి 2019 వరకు నెల్లూరు పట్టణాన్ని నారాయణ అభివృద్ధి చేశారు. నారాయణ రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించారు. నెల్లూరు జిల్లా అభివృద్ధికి వందలాది కోట్లు ఖర్చు చేశారు. నెల్లూరు స్వరూపాన్నే మార్చేశారు. నారాయణను ఎందుకన్నా ఓడించామా అని నెల్లూరు వాసులు పాశ్చాత్తాపం పొందతుతున్నారు. ఇప్పుడు ఆయనను గెలిపించడానికి నెల్లూరు జిల్లా ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. అందరూ ఈసారి నారాయణ గెలవాలి అని అనుకుంటున్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసి నారాయణ ఇంటిపై దాడి చేశారు.
