తెలుగు సినీ పరిశ్రమలో మంచి స్నేహ బంధం కలిగిన వ్యక్తులు పవన్ కళ్యాణ్… త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి మూవీలు రూపొందాయి. ఇకపోతే నేరుగా పవన్ తో త్రివిక్రమ్ ఈ మధ్య కాలంలో సినిమాలు చేయకపోయినప్పటికీ ఆయన చేస్తున్న సినిమాలకు ఎంతో కొంత సహాయ సహకారాలను అందిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన భీమ్లా నాయక్ మరియు బ్రో సినిమాలకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే ను… డైలాగ్ లను అందించి తన వంతు సహాయం చేశాడు. ఇకపోతే పవన్ ప్రస్తుతం “ఓజి” సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ మూవీ టీజర్ ను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల చేశారు. దీనికి ప్రస్తుతం ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ టీజర్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చూసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా టీజర్ చూసిన అనంతరం ఈ మూవీ దర్శకుడు అయినటువంటి సుజిత్ కు ఫోన్ చేసి టీజర్ అద్భుతంగా ఉంది. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను. నీకు నా తరపు నుండి ఈ సినిమా విషయంలో ఏదైనా సహాయం కావాలి అన్న వెంటనే నన్ను సంప్రదించు ఏ సహాయం అయినా నేను చేస్తాను అని స్పందించినట్లు తెలుస్తోంది.
