రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతుంది: ఆర్ కృష్ణయ్య

Share this :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాతిక వేల పోస్టులతో మెగా డీఎస్సీని విడుదల చేయాలనీ బీసీ సంక్షేమ సంఘం యొక్క జాతీయ అధ్యక్షుడు ఐనటువంటి ఎంపీ ఆర్.కృష్ణయ్య గారు డిమాండ్ చేశారు లేకపోతే ఈ జరుగుతున్న ఉద్యమం అనేది ఆపమని హెచ్చరించారు.అయితే సోమవారం రోజున నిరుద్యోగ జేఏసీ చైర్మన్ ఐనటువంటి నీలా వెంకటేశ్, గుజ్జ కృష్ణ గారి పర్యవేక్షణలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో నిరుద్యోగులు అందరూ మహాధర్నా చేపట్టారు.

వర్షాన్ని లెక్కచేయకుండా కూడా భారీగా తరలివచ్చిన ఈ నిరుద్యోగ యువత మాత్రం మెగా డీఎస్సీని అనౌన్స్ చేయాలని పెద్ద పెద్ద ఎత్తున నాదాలు చేశారు. ఈ ఉద్యమంలో కృష్ణయ్య గారు పాల్గొని నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ రాష్ట్రంలో పాతిక వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ ఇచ్చిన నివేదికలో అదే ఉందని గుర్తుచేశారు. అయితే దానికి విరుద్దంగా ఐదు వేల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని చెప్పడం చాలా అన్యాయము అని అన్నారు.

పాతిక వేలు ఖాళీగా ఉన్న పోస్ట్లు అన్నీ డీఎస్సీ ద్వారా ప్రకటించి అన్నీ భర్తీ చేయాలనీ అప్పటి దాకా ఈ ఉద్యమం ఆగేదిలేదని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన వారి ఆవేదన చెప్పుకున్నారు. అయితే ఇది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతుందని అందరూ అన్నారు.