చంద్రబాబు అరెస్ట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

Share this :

ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉంచిన విషయం తెలిసిందే.చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. విజన్ గల నాయకుడిని అరెస్ట్ చేయడం ఖచ్చితంగా కక్ష్యపూరిత చర్యలే అంటే ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణలో పలువురు రాజకీయ నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా ఆయన అరెస్ట్ పై బీఆర్ఎస్  ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బోదన్ లో బీడీ టేకే దారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడు అని. ఆయన అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్డం శోచనీయం అన్నారు. తెలంగాణ వస్తే ఆంధ్రావాళ్లను కష్టాలు పెడతారని.. అరెస్ట్ చేస్తారని ఎన్నో పుకార్లు సృష్టించారు.. కానీ ఆంధ్రవాళ్లను ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు సీఎం కేసీఆర్. ఒక సీనియర్ నాయకుడిని అరెస్ట్ చేసే సమయంలో అన్నీ ఆలోచించాలని అన్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎల్బీ నగర్ లో ఆయనకు మద్దతుగా తీసిన ర్యాలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి సైతం ఆయన అరెస్ట్ అక్రమం అన్నారు. జగన్ ఎలక్షన్ ముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆయన తీసిన గొయ్యిలో ఆయనే పడతారని గమనించడం లేదు అన్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సైతం చంద్రబాబు అరెస్ట్ ని ఖండించిన విషయం తెలిసిందే.