ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు…!!

Share this :

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ నెల  21 నుంచి మొదలై 27 వరకూ 5 రోజుల పాటు సమావేశాలు కొనసాగాయి. మొదట్లో రెండు రోజులు సమావేశాలు టీడీపీ నిరసనలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు, విజిల్స్, అరుపులు, కేకలతో రెండు రోజులు సమావేశాలు నువ్వా నేనా అన్నట్టు జరిగాయి. దాని కారణంగా టీడీపీ లో కొంతమందిని సస్పెండ్ చేయడం వల్ల వారు లేని సమావేశాలు ఇంకో రెండు రోజులు జరిగాయి. అయితే నేటికీ చివరి ఘట్టనికి చేరుకున్నాయి సమావేశాలు. అయితే సభలో ఈ రోజు మెయిన్ గా రెండు కీలక బిల్లులు ప్రవేశ పెట్టబోతోంది ప్రభుత్వం అని తెలుస్తుంది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పులో అక్రమాలపై అధికార పార్టీ సభ్యులు మాట్లాడనున్నారు. అలాగే ఆరోగ్య రంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు, దేవాలయాల అభివృద్ధి-ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా చిన్నపాటి చర్చ జరిగింది. ఏపీ సివిల్స్ కోర్ట్స్ బిల్లు -2023, ఏపీ గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ బిల్లు – 2023, ఏపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సెండక్ అమెండ్మెంట్ బిల్లు – 2023, ఏపీ రెగ్యూలైజేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల బిల్లు – 2023 అలాగే ఏపీ అప్రాప్రియేషన్ నెం. -3 బిల్లు 2023 ఆమోదం పొందాయి.