ఢిల్లీ, అక్టోబర్ 25: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి (death of YS Rajasekhar Reddy) దుర్మరణాన్ని తట్టుకోలేక వెయ్యి నుంచి 1500 మంది చనిపోయినట్టుగా చెప్పిన లెక్క బోగస్ (bogus estimation) అని ఒప్పుకుంటే ఒప్పుకోండి. కానీ తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Arrest) అక్రమ అరెస్టుకు తెదేపా కార్యకర్తలు, ఆయన అభిమానులు కలత చెంది మృతి చెందారనేది మాత్రం పచ్చి నిజమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghu rama Krishna raju) రచ్చబండ కార్యక్రమంలో (Raghu Rama Krishna Raju Rachabanda) పేర్కొన్నారు.
తెదేపా (TDP) నాయకులు కూడా తప్పుడు లెక్కలు చెప్పాలనుకుంటే 1000 నుంచి 1500 మంది చనిపోయారని చెప్పి ఉండేవారు. కానీ అలా కాకుండా ఎంతమంది అయితే చనిపోయారో, అంతమంది పేర్లను మాత్రమే ఆరా తీసి ఆ మేరకే చెప్పారంటూ బుధవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు అన్నారు. వైయస్ కుటుంబంలో దాదాపు 150 మందికి పైగా సభ్యులు ఉంటారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం చెందితే ఆయన కుమారుడు జగన్ (AP CM YS Jagan), కూతురు షర్మిల, ఆమె భర్తకు ఏమీ కాలేదు. ఇంకా ఎంతో మంది ఉన్నా వారి కుటుంబ సభ్యులెవరికి కూడా చిన్న తలపోటు రాలేదు. జనాభా లెక్కల్లో చనిపోయిన వారందరినీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణ తట్టుకోలేకనే చనిపోయినట్టుగా తప్పుడు లెక్కలు (bogus calculations on YS Rajasekhar Reddy) చెప్పారని అన్నారు.
నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది
ఒక మహిళ కష్టాల్లో ఉండి, దేవుడిని దర్శించుకుని ప్రజలకు నిజం చెప్పాలని భావిస్తే, సాటి మహిళగా మంత్రి రోజా (Minister Roja) పేరడీ చేయడం విడ్డూరంగా ఉంది. నిజంగానే నిజం గెలిస్తే భువనేశ్వరితో పాటు, నారా లోకేష్ కూడా అరెస్ట్ అవుతారనడం చూస్తుంటే ఆమె ఎంత అక్కసు తో మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. మంత్రి రోజా వ్యవహార శైలి ఏ మహిళ కూడా హర్షించదు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. మంత్రిగా తన హోదాకు తగ్గట్లుగా మాట్లాడాలన్నారు.
భువనేశ్వరి చేపడుతున్న నిజం గెలవాలి యాత్రకు మహిళలు నీరాజనాలు పలుకుతారు. జైల్లో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆయనకు రెండు వారాల ఇంట్రీమ్ బెయిల్ లభిస్తుందని ఆశిస్తున్నాను. నవంబరు ఏడవ తేదీలోగా రిమాండ్ రిపోర్టు (Remand Report) క్వాష్ కోసం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు (Supreme Court On Skill Case) వెలువడుతుంది. అవినీతి నిరోధక చట్టంలోని 17 A నిబంధన కింద కేసును కొట్టి వేయడం ఖాయం. భవిష్యత్తుకు భరోసా యాత్రను జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. కొంతమంది ఈ యాత్రను నారా లోకేష్ (Nara Lokesh) చేపడతారని అంటున్నారు. ఈ యాత్రను చంద్రబాబు నాయుడే చేపడతారు. నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) చేపడుతున్న నిజం గెలవాలి యాత్ర ద్వారా నిజమే గెలుస్తుందని ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.
విజయదశమి నుంచే వైసీపీ నేతలకు నిద్రలేమి రోజులు షురూ
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంయుక్త నాయకత్వంలో టెన్టీటివ్ గా ఒక మేనిఫెస్టోను ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. తెదేపా పేర్కొన్న ఆరు అంశాలతో పాటు, జనసేన అధినేత మరో నాలుగు అంశాలను మేనిఫెస్టో రూపకల్పనకు జోడించారు. ఈ రెండు పార్టీల కలయికతో ఉభయగోదావరి జిల్లాలలోని తెదేపా, జనసేన క్యాడర్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఇరు పార్టీల శ్రేణులు కలిసి ఇంటింటికి వెళ్లి తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను (TDP Manifesto) వివరిస్తున్నారు. దీనితో విజయదశమి నుంచే వైసీపీ నేతలకు నిద్రలేమి రాత్రులు మొదలయ్యాయని ఎద్దేవా చేశారు.
తాజాగా తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల వెంకటేశ్వర స్వామిని (TTD) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన పెళ్లయిన తర్వాత చంద్రబాబు నాయుడు తోడు లేకుండా, తిరుమలేశుని దర్శించుకోవడం ఇదే మొదటిసారని వాపోయారు. ఎటువంటి సాక్ష్యం లేకుండా అన్యాయంగా చంద్రబాబుని అరెస్టు చేసి జైలులో నిర్బంధించారు. దీని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వ పెద్దలకు తెలుస్తుందని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.
Also Read: Wife Sold Her Husband: ‘శుభలగ్నం’ సీన్ రిపీట్.. భర్తను రూ. 5 లక్షలకు వేరే మహిళకు అమ్మేసిన భార్య
సాధికారిక యాత్ర పేరిట మీ ముందుకు వచ్చే మంత్రులను ప్రశ్నించండి
సామాజిక సాధికారిక యాత్ర పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి యాత్రలను చేపట్టనున్నట్లు ప్రకటించారు. సభ కు హాజరైన వారికి గతంలో బిర్యాని ప్యాకెట్లు, రిటర్న్‌లో మందు సీసాలు ఇచ్చేవారు. ఇప్పుడు క్వార్టర్ సీసాలు కాదు కేసులు ఇచ్చినా సాధికారిక యాత్రకు ఎవరు వచ్చే పరిస్థితి లేదు. సామాజిక సాధికారిక యాత్ర పేరిట సభకు వచ్చే వారిని డాక్టర్ సుధాకర్ ఎలా మరణించారో చెప్పమని ప్రశ్నించండన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యమును హత్య చేసి పార్సెల్ చేసిన వ్యక్తికి ఏ శిక్ష పడిందో నిలదీయండని ఎంపీ రఘురామ పేర్కొన్నారు.
దళిత యువకుడికి శిరోమండనం చేసిన కేసు ఏమయిందని, హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంగా ఓ దళిత యువకుడిని చంపేసిన సంఘటనను, తన సోదరిని వేధించవద్దని ప్రాధేయపడిన మైనర్ బాలున్ని కాల్చి చంపిన నిందితునికి ఏ శిక్ష విధించారో చెప్పామంటూ ప్రశ్నించాలని రఘురామకృష్ణం రాజు (Raghurama Krishnamraju) సూచించారు. సీఎం జగన్‌పై ఉన్న కోపాన్ని ప్రజలు పోలింగ్ బూత్ లో తీర్చుకోనున్నారని అన్నారు. తెదేపా, జనసేన కూటమి సునాయసంగా 150 స్థానాలలో విజయం సాధిస్తుంది. వైకాపా నేతల మాదిరిగా 175కు 175 స్థానాలలో గెలుస్తామని కూటమి నేతలు బీరాలు పలకడం లేదు. తమకు 160 స్థానాలు వస్తాయని చెబుతున్నారు. కచ్చితంగా కూటమి అభ్యర్థులు 160 స్థానాలలో గెలిచే అవకాశాలు ఉన్నాయని రఘురామకృష్ణం రాజు అన్నారు.
