TDP Bathyala Changal Rayudu: టీడీపీ నేత అచ్చెనాయుడుతో బత్యాల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

'మన బూతే మన భవిష్యత్' ప్రత్యేక కార్యక్రమంపై వివరణ

TDP Bathyala Changal Rayudu met with Atchannaidu TDP Bathyala Changal Rayudu met with Atchannaidu
Share this :

మంగళగిరి, నవంబర్‌ 7: ప్రతి నెల 3 రోజులు మంగళగిరి (Mangalagiri)లోని తెలుగుదేశం పార్టీ (TDP) కేంద్ర కార్యాలయం బాధ్యతల్లో భాగంగా సోమవారం (నవంబర్‌ 6) తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడును (TDP Atchannaidu) బాత్యాల చెంగలరాయుడు (TDP Bathyala Changal Rayudu) కలిసారు. ఆయనతో రాజంపేట నియోజకవర్గం (Rajampet constituency)లో జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమం ‘మన బూతే మన భవిష్యత్’, ‘ఓటర్ వెరిఫికేషన్’, ‘భవిష్యత్ గ్యారెంటీ’ ఇంకా పలు విషయాలపై (AP Elections 2024) ముచ్చటించారు.

Also Read: TDP Bathyala Changalrayudu: ‘రాజకీయాలే వదిలేస్తా.. పార్టీ మారను, బరిలో ఉంటున్నా’ ఆ వార్తలను ఖండించిన బత్యాల

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు (Atchannaidu)తో ఆయన మాట్లాడుతూ.. రాజంపేట నియోజకవర్గంలో యూనిట్లు వారిగా ఆ యూనిట్ పరిధిలోని బూత్ కన్వీనర్లు, కమిటీ సభ్యులు, బీఎల్ఏ (BLA)లతో సమావేశం ఏర్పాటు చేసి ఓటర్ వెరిఫికేషన్ (Voter Verification) పై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నామన్నారు. అలాగే గ్రౌండ్ లెవెల్‌లో వాళ్ళు ఇస్తున్న సమాచారాన్ని తీసుకొని వాటర్ సంబంధిత ఎన్నికల అధికారి దృష్టికి వాటిని పరిశీలించి పూర్తి చేసేలా ప్రయత్నిస్తున్నామని బత్యాల (Bathyala Changal Rayudu) అన్నారు.

అలాగే ఇప్పటివరకు చనిపోయిన సుమారు 22 వేలు మంది ఓట్లు, రెండు ఓట్లు కలిగి వారి ఓట్లు, ఆ ప్రదేశం నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన వారి ఓట్లు.. ఇలాంటి ఓట్లను ఫామ్ – 7 ద్వారా తొలగించడానికి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశామన్నారు. ఈ విషయం ఎన్నికల అధికారి దృష్టికి పలు మార్లు తీసుకెళ్లగా వాటిలో సుమారు 14 వేలు ఓట్ల (Voter list)ను తొలగించినట్లు తెలిపారు.

Also Read: TDP Nilayapalem Vijay Kumar Flagged on CM Jagan: ‘కృష్ణా జలాల పంపిణీలో ఏపీకి అన్యాయం జరుగుతున్నా సీఎం జగన్‌ ఎందుకు నోరెత్తడం లేదు?’ 

ఇంకా ప్రతి బూతులో BLAల ద్వారా 2024 డ్రాఫ్ట్ లిస్ట్ (Draft List) కూడా పూర్తిస్థాయిలో పరిశీలించి, మిగిలిన వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. అలాగే నియోజకవర్గంలో ప్రతి యూనిట్‌లో ‘బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ’కి సంబంధించిన ప్రజా వేదికలను కూడా ఏర్పాటు చేసి గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి అందే పథకాలపై క్లుప్తంగా వివరించడం జరుగుతుందని ఆయన అచ్చెన్నాయుడు (Atchannaidu)కి తెలిపారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.