Selfie in Voting Booth హైదరాబాద్, నవంబర్ 17: ఈ రోజుల్లో చేతిలోకి స్మార్ ఫోన్ వచ్చాక సెల్ఫీ (Selfie) దిగడం డ్రెండ్‌గా మారిపోయింది. సమయం సందర్భం లేకుండా ఎక్కడపడితే అక్కడ దేనితో పడితే దానితో, ఎవరితో అయినా సెల్ఫీ దిగేందుకు సిద్ధమైపోతున్నారు యూత్. సాధారణంగా సెలబ్రిటీతోనో, పొలిటికల్ లీడర్‌తో.. ఏదైనా అసాధారణ సంఘటన జరిగినప్పుడు సెల్ఫీ దిగడం పరవాలేదు.
కానీ కొంతమంది అత్యుత్సాహంతో ఓటు (Telangana Elections 2023) వేస్తూ మరి సెల్ఫీ (Selfie) దిగి సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేస్తున్నారు. మేము ఈ గుర్తుకు ఓటు వేసాం… ఆ గుర్తుకు ఓటు వేశాం (Selfie in Voting Booth) అంటూ హల్‌చల్ చేస్తున్నారు. మరికొందరైతే మరో అడుగు ముందుకేసి పలానా పార్టీకి ఓటు వేశాం అంటూ.. ఈవీఎం మిషన్ పై వేలు కనిపించేలా తమ మొహం కనిపించేలా సెల్ఫీలు తీసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఎలక్షన్ కమిషన్ (Election Commission) పూనుకుంది.
ఇది ఇతర ఓటర్లను ప్రభావితం చేస్తుందని, రహస్య బ్యాలెట్ పద్ధతిని అవమానించేలా ఉందని పేర్కొంది. దీన్ని అరికట్టేందుకు ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా పోలింగ్ బూత్‌లో ఫోటో దిగితే వారి ఓటు హక్కును రద్దు చేయడంతోపాటు 3 నెలలు జైలు శిక్ష విధిస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు.. వారు వేసిన ఓటును కూడా లెక్కలోకి తీసుకోమని హెచ్చరించింది. ఒకసారి ఓటు హక్కు రద్దు చేయబడితే ఆ తర్వాత మళ్లీ ఓటు పొందడం చాలా కష్టం. వీటన్నిటితో పాటు చట్ట ప్రకారం చర్యలు కూడా ఉంటాయని పేర్కొంది.
ఎప్పటి నుంచో పోలింగ్ బూత్ లోపలికి ఫోన్ (smart Phone) అనుమతించకుండా నిషేధం విధించింది ఎన్నికల కమిషన్. అయినప్పటికీ దొంగ చాటుగా, పోలీస్ తనిఖీలకు దొరకకుండా కొంతమంది పోలింగ్ బూత్ (Polling Booth) లోపలికి ఫోన్లను తీసుకెళ్తున్నారు. ఓటు వేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది ఇకపై సరదా కాదు సీరియస్ యాక్షన్ అంటూ తాజాగా ఎలక్షన్ కమిషన్ (Election Commission) వార్నింగ్ ఇచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Comments are closed.