Kukatpally Janasena కూకట్‌పల్లి, నవంబర్ 22: చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు టీడీపీ (TDP) సంక్షోభంలోకి వెళ్లింది. అలాంటి స్థితిలో టీడీపీ పార్టీ అధ్యక్షుడు, జనసేన అధినేత ఇచ్చిన భరోసా అంతా ఇంతాకాదు. చంద్రబాబు అరెస్ట్ (Chandrababu)ను తొలిసారిగా ఎదిరించిన ఏకైక నేతగా పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ముందుకొచ్చారంటూ కాపు వెల్ఫేర్ డాట్‌కమ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యాళ్ల వరప్రపాద్ కొనియాడారు.
చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అయినప్పుడు రాజమహేంద్రవరం జైలుకెళ్లి పవన్ పరామర్శించారు. చంద్రబాబు కుటుంబాన్ని ఓదార్చారు. పరామర్శించి బయటకు వచ్చిన వెంటనే బేషరతుగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు కూడా. ఏకపక్షంగా ఏమాత్రం ఆలోచించకుండా తెలుగుదేశం పార్టీ (TDP)తో జనసేన (Janasena) పొత్తును ప్రకటించి నైతిక మద్దతు ఇచ్చారని యాళ్ల వరప్రపాద్ (Kapuwelfare.com President Yalla Vara Prapad) విడుదల చేసిన మీడియా ప్రతిలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కమ్మ సామాజిక వర్గం వారికి ఓ విన్నపం చేశారు..
చదవండి: Social Media Stars in Politics: రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారిన సోషల్ మీడియా స్టార్లు
‘ఆ రోజు పవన్ నిర్ణయం తెలుగుదేశం పార్టీకి పెద్ద ఊరట అనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి వేరేపార్టీలతో ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా.. ఏపీలో పొత్తులో ఉన్న పార్టీకి కూకట్ పల్లి (Kukatpally)లో మద్దతివ్వడం మీ కనీస బాధ్యత. జనసేన పార్టీ తరపున బీఫారం తీసుకుని పోటీ చేస్తున్న అభ్యర్ధి గెలుపే మాకు ముఖ్యం. కమ్మ కులస్థులైన మీరు జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ (Kukatpally Janasena Candidate Premkumar) గెలుపుకు కృషి చేయాలన్నారు. అలా చేయని పక్షంలో ఏపీలో తెలుగుదేశం పార్టీకి పెద్ద నష్టం తెచ్చిపెడుతుందన్నారు. ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సత్తాచూపించి టీడీపీ అభ్యర్ధుల్ని, టీడీపీ ద్వారా పోటీ చేసేవారందరినీ ఓడించేశక్తి జనసేనకు ఉందని మీకు తెలుసని గుర్తుచేశారు. అక్కడ మనమంతా కలిసి ఎన్నికల్లో గెలవాలంటే తెలంగాణలో ముఖ్యంగా కూకట్‌పల్లిలో జనసేన గెలవాలని సూచించారు. అందుకే వారి సహకారం ఇక్కడ కావాలని, అక్కడ ఇక్కడ కలిసి గెలుద్దాం..కలిసి రండి అంటూ పిలుపునిచ్చారు.
‘కూకట్‌పల్లి జనసేన అభ్యర్ధి ప్రేమ్‌కుమార్ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి నందమూరి సుహాసినికి మద్దతు ఇచ్చారు. గతంలో సాయం చేశారనే కృతజ్ఞత టీడీపీకి ఉంటుందని భావిస్తున్నాం. జనసేన విన్నపాన్ని కమ్మ సామాజిక వర్గం పెద్దలకి, టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి, కూకట్ పల్లిలోని కమ్మ సామాజిక వర్గం వారందరికీ తెలియజేయాలని, కూకట్‌పల్లి జనసేన అభ్యర్ధి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటున్నాం’ అంటూ కాపు వెల్ఫేర్ డాట్‌కమ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యాళ్ల వరప్రపాద్ మీడియా ప్రతిలో పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ తాజా రాజకీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

Comments are closed.