AP DSP Died at TTD: తిరుమలలో విషాదం.. శ్రీవారి నడక మార్గంలో గుండెపోటుతో డీఎస్పీ మృతి!

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన భద్రతా విధుల్లో ఉండగా..

Share this :

AP DSP Died at TTD తిరుపతి, నవంబర్ 25: తిరుపతి (Tirupathi)లో శనివారం (నవంబర్ 25) విషాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి నడకదారిలో (TTD Srivari walkway) ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌ (AP Intelligence DSP Died at Tirumala) (59) గుండెపోటు (heart attack)తో మృతి చెందారు. 1,805 మెట్టు వద్ద (TTD) ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. అక్కడే ఉన్న పోలీస్‌ సిబ్బంది ఆయన్ని ఆసుపత్రికి తరలించేలోపే డీఎస్పీ కృపాకర్‌ (DSP Krupakar) కన్నుమూశారు.

చదవండి: Mansoor Ali Khan Public Apology: ఎట్టకేలకు నటి త్రిషను క్షమాపణ కోరిన మన్సూర్‌ అలీఖాన్.. అసలేంటీ వివాదం?

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం కృపాకర్‌ తిరుమలకు వచ్చారు. విజయవాడ సమీపంలోని పోరంకి ఆయన స్వస్థలం. ఈ ఘటనపై ఆయన కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. కాగా గత కొంత కాలంగా వయసుతో సంబంధం లేకుండా ఐదేళ్ల పసివాళ్ల నుంచి 60 యేళ్ల ముదుసలి వరకు గుండెపోటుతో వరుస మరణాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా విధుల్లో ఉన్న డీఎస్పీ ఆకస్మిక మరణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.