చేగుంట, డిసెంబర్ 5: గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువతిని దారుణంగా హత్య (Medak woman Murder Case)చేశారు. అనంతరం పెట్రోల్ (Petrol) పోసి కాల్చివేసిన ఘటన మెదక్ జిల్లా (Medak District)చేగుంట మండలం వడియారం సమీపంలో ప్రధాన రహదారి పక్కన చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై హరీశ్ వివరాల ప్రకారం..
సుమారు 25 ఏళ్ల వయసు ఉన్న గుర్తుతెలియని యువతి మృతదేహం హైదరాబాద్ (Hyderabad)కు వెళ్లే రహదారి పక్కన సగం కాలిపోయిన స్థితిలో (Half Burnt Dead Body) సోమవారం (డిసెంబర్ 4) స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. అక్కడి ఆనవాళ్లను బట్టి, ముందుగా ఎక్కడో ఆమెను హత్యచేసి, ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి పెట్రోలు పోసి నిప్పటించి ఉంటారని ఎస్సై అనుమానించారు. మృతురాలి శరీరంపై కాషాయ రంగు టాప్, ఎరుపు లెగ్గిన్ ఉందని పేర్కొన్నారు.
మృతురాలి గురించి తెలిసిన వ్యక్తులు, సంబంధిత బంధువులు ఎవరైనా ఉంటే చేగుంట పోలీసుస్టేషన్, రామాయంపేట సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన మీడియాకు తెలిపారు.
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Comments are closed.