హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్.. కానీ…!

కొన్ని గంటల్లోనే రీ-ఎంట్రీ

Share this :

 

భారత స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో చేసిన ఒక ఆకస్మిక విన్యాసం క్రికెట్ అభిమానులను తీవ్ర అయోమయానికి గురిచేసింది. బుధవారం నాడు హార్దిక్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఒక్కసారిగా డిలీట్ లేదా డీయాక్టివేట్ చేసేశాడు. కొన్ని గంటల పాటు అతని ప్రొఫైల్‌ను వెతికిన వారికి ‘యూజర్ నాట్ ఫౌండ్’ (User not found) అని మాత్రమే కనిపించింది. అయితే, ఈ షాక్ నుండి ఫ్యాన్స్ తేరుకోకముందే, కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ అతని అకౌంట్ ప్రత్యక్షమైంది.

Also Read: Ys Sharmila: వైఎస్ షర్మిలకు కర్ణాటక నుండి రాజ్యసభ?

ఈ ఆకస్మిక మాయం, తిరిగొచ్చుడు వెనుక ఉన్న కారణాలపై హార్దిక్ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో నెట్టింట రకరకాల గాసిప్స్ నడుస్తున్నాయి. హార్దిక్ పాండ్యా ఈ విధమైన నిర్ణయం తీసుకోవడానికి ముంబై ఇండియన్స్ ఎదుర్కొన్న ఘోరమైన ఐపీఎల్ 2026 సీజనే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు.. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకుని ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
హార్దిక్ కెప్టెన్సీ, అతని ఫామ్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్, విమర్శలు వచ్చాయి. ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు ఉన్నాయని, హార్దిక్ వచ్చే ఏడాది మరో ఫ్రాంచైజీకి మారిపోతాడనే ఊహాగానాలు ఈ ఒత్తిడిని మరింత పెంచాయి. ఈ సీజన్‌లో హార్దిక్ 10 మ్యాచ్‌ల్లో కేవలం 206 పరుగులు మాత్రమే చేసి, బౌలింగ్‌లో కేవలం 4 వికెట్లు పడగొట్టి ఘోరంగా విఫలమయ్యాడు. అకౌంట్ డిలీట్ చేయడానికి ముందు హార్దిక్ పాండ్యా తన ఫోన్ స్క్రీన్‌పై “07:07” సమయాన్ని చూపిస్తున్న ఒక రహస్యమైన ఫోటోను పోస్ట్ చేశాడు.
Also read:Tamilnadu: తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం..!
దీనిని చూసిన అభిమానులు.. నంబర్ 7 జెర్సీ కలిగిన ఎంఎస్ ధోనీ లెగసీని అందుకోవడానికి హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) లోకి మారబోతున్నాడంటూ రూమర్స్ సృష్టించారు. ఈ వివాదాల మధ్యే హార్దిక్‌కు పాత వెన్నునొప్పి సమస్యలు (Back Spasms) మళ్లీ తిరగబెట్టడంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. జూన్ 14 నుండి ఆఫ్ఘనిస్తాన్‌తో ప్రారంభం కాబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు హార్దిక్ ఎంపిక కావాలంటే మొదట బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) నుండి మెడికల్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. అటు ఫిట్‌నెస్ సమస్యలు, ఇటు సోషల్ మీడియా డ్రామాలతో ఇండియా టాప్ ఆల్‌రౌండర్ కెరీర్ ప్రస్తుతం తీవ్ర గందరగోళంలో పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

leave a reply