భారత టీనేజ్ బ్యాటింగ్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(vaibhav suryavanshi) సీనియర్ టీమిండియా అరంగేట్రం (Debut) చుట్టూ జరుగుతున్న చర్చపై మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు ఎంపికైనప్పటికీ తుది జట్టులో వైభవ్‌కు చోటు దక్కకపోవడంపై అభిమానుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమిండియా కోచింగ్ స్టాఫ్.. ఈ 15 ఏళ్ల కుర్రాడితో కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, అతనికి సరైన సంకేతాలు ఇవ్వాలని పార్థివ్ పటేల్ సూచించారు.
స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడిన పార్థివ్ పటేల్.. ఇంగ్లాండ్ సిరీస్‌లో వైభవ్‌కు ఎదో ఒక మ్యాచ్‌లో ఖచ్చితంగా అవకాశం వస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్‌లో చోటు ఎందుకు దక్కడం లేదనే నిజాన్ని అతనికి స్పష్టంగా వివరించడం చాలా ముఖ్యమని అన్నారు. “అతను కేవలం 15 ఏళ్ల చిన్న పిల్లాడు. ఒకవేళ మ్యాచ్ ఆడించకపోతే.. ఆ విషయాన్ని అతనికి ముందే చెప్పేయండి. అతనితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, కొంచెం ఓపికగా ఉండటం నేర్పించాలి” అని గంభీర్ మేనేజ్మెంట్కు పార్థివ్ పటేల్ స్పష్టమైన సందేశం ఇచ్చారు.
ప్రస్తుతం టీమిండియా టాప్ ఆర్డర్లో విపరీతమైన పోటీ ఉండటమే వైభవ్‌కు అవకాశం రాకపోవడానికి ప్రధాన కారణమని పార్థివ్ విశ్లేషించారు. టీ20 వరల్డ్ కప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్, ఐసీసీ నంబర్ 1 ర్యాంకర్ ఇషాన్ కిషన్, నంబర్ 2 ర్యాంకర్ అభిషేక్ శర్మ లాంటి పవర్ఫుల్ ప్లేయర్స్ రేసులో ముందున్నారని గుర్తు చేశారు. ఇంతటి సీనియర్ల మధ్య ప్రస్తుతం జట్టులో ఖాళీ లేదనే వాస్తవాన్ని వైభవ్‌కు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత కోచింగ్ స్టాఫ్‌పై ఉందన్నారు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి