వాళ్లిద్దరి మధ్య గొడవలా.. నిజమేనా..?

పవన్ కల్యాణ్, నారా లోకేష్ మధ్య గొడవలు వస్తున్నాయా..?

Share this :

కూటమి ప్రభుత్వంలో విభేదాలు వచ్చాయి..? కూటమిలో కీలక నేతలుగా ఉన్న పవన్ కల్యాణ్, నారా లోకేష్ మధ్య గొడవలు వస్తున్నాయా..? ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకున్నారా..? ఎవరెవరు ఎవర్ని కలుస్తున్నారో.. ఒకరికి తెలియకుండా ఇంకొకరు తెలుసుకుంటున్నారా..? ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి మంత్రి నారా లోకేష్ ఆరా తీస్తున్నారని.. పవన్ కోసం ఓ ప్రత్యేక నిఘా బృందం కూడా ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెద్ద వైరల్‌గా మారింది. నిజానికి ఇది వైరల్‌గా మారింది అనటం కంటే కూడా.. వైసీపీ నేతలే దీనిని వైరల్ చేశారనటం కరెక్టు మాట.

Also read: బెజవాడ మేయర్ రేసులో ఆ ఇద్దరు..?

2014 ఎన్నికల్లో తెలుగుదేశం – భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనప్పటికీ.. పవన్ మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వేరు వేరుగా పోటీ చేశారు. కానీ.. 2024 ఎన్నికల నాటికి పరిస్థితి మారిపోయింది. అక్రమ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత పవన్ కల్యాణ్ నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. లోకేష్, బాలకృష్ణతో కలిసి చంద్రబాబును పరామర్శించారు. ఆ తర్వాత జైలు బయటే.. రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని ప్రకటించారు. నాటి నుంచి పవన్ కల్యాణ్‌ను నారా లోకేష్.. పవనన్న అని పిలుస్తున్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ – లోకేష్ మధ్య అదే బంధం కొనసాగుతోంది. చంద్రబాబు కూడా పవన్ కల్యాణ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్‌కు డిప్యూటీ సీఎం హోదాతో పాటు ఆయన కోరిన శాఖలను చంద్రబాబు కేటాయించారని పార్టీ నేతలే చెబుతున్నారు. ఇటీవల పవన్‌ భుజానికి శస్త్ర చికిత్స జరిగితే.. ముంబై వెళ్లి మరీ చంద్రబాబు పరామర్శించారు. పవన్ హైదరాబాద్ చేరుకున్న తర్వాత మంత్రి నారా లోకేష్ కూడా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అయితే వైసీపీ అనుకూల మీడియా మాత్రం.. ఓ కట్టుకథను వండి వార్చే ప్రయత్నం చేసి బొక్క బోర్లా పడింది.

పవన్ కల్యాణ్ పైన నారా లోకేష్ నిఘా పెట్టారని.. పవన్ ఎవరెవర్ని కలుస్తున్నారో.. ఎవరితో సమావేశం అవుతున్నారో.. ఎవరితో ఏం మాట్లాడుతున్నారనే విషయాలను లోకేష్ రహస్యంగా తెలుసుకుంటున్నారని లేని కథ అల్లేశారు. పవన్ కళ్యాణ్‌పై లోకేష్ నిఘా నేత్రం..! అంటూ ఓ హెడ్డింగ్ పెట్టి.. పవన్ గురించి ప్రతి విషయం లోకేష్‌ తెలుసుకుంటున్నారని.. ఈ విషయం తెలుసుకున్న జనసేన వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని కూడా ఓ కట్టుకథ అల్లేసింది. మరో అడుగు ముందుకు వేసి.. పవన్‌కు భద్రతా లోపం కూడా ఉందని.. లేని పోని అబద్ధాలతో మసి పూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేసింది. ఈ కథనం వచ్చింది వైసీపీ అనుకూల మీడియాలో అనే విషయం అందరికీ తెలుసు.

Also Read: ప్లాట్‌ఫామ్ టికెట్ కంటే, ట్రైన్ టికెట్ చౌక..!

అయితే దీనిపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ అధికారికంగా వివరణ ఇచ్చింది. “”పవన్ కళ్యాణ్ పై లోకేష్ నిఘా నేత్రం” అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. ఇలాంటి ఫేక్ వార్తలను షేర్ చేయడం, ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా హాండిల్స్ పై ప్రభుత్వం చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.” అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఇలాంటి తప్పుడు కథనాలు రాసిన వారిపై కఠిన చర్యలుంటాయని కూడా వార్నింగ్ ఇచ్చింది.

leave a reply