నోటి దూలను క్షమించని విజయ్, ఎమ్మెల్యేల అరెస్ట్ అందుకే..!

తగ్గేదే లేదంటున్న సీఎం విజయ్..

Share this :

తమిళనాడు రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన సినీ నటుడు, టీవీకే (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్ తనను లేదా తన ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యక్తిగత దూషణలు, బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టపరంగా ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేయడం రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Also Read: కీలక పోస్టులో అవినీతి అధికారి.. ఏమిటిది బాబు..? 

తాజా ఘటనలో తూత్తుకుడి జిల్లా విలాతికుళం నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే జి.వి. మార్కండేయన్‌ను జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 18న కోవిల్‌పట్టిలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ముఖ్యమంత్రి విజయ్‌ను ఉద్దేశించి తీవ్రమైన వ్యక్తిగత మరియు బెదిరింపు వ్యాఖ్యలు చేశారనేది ప్రధాన ఆరోపణ. అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నియోజకవర్గం నుండి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ ఓడిపోయిన తర్వాత.. సీఎం విజయ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై మార్కండేయన్ తీవ్రంగా స్పందించారు. “అసెంబ్లీ తలుపులు లాక్ చేస్తానని ముఖ్యమంత్రి అంటున్నారు. ఒకవేళ లాక్ చేస్తే అతని ఎముకలు విరగ్గొడతాం. అసెంబ్లీలో నిన్ను ఎలా చూసుకోవాలో మాకు తెలుసు” అంటూ మార్కండేయన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టీవీకే జిల్లా కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు మార్కండేయన్‌ను అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ముఖ్యమంత్రి విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్టయిన రెండవ డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ కాగా, అంతకుముందే ఇదే తరహా కేసులో మాజీ మంత్రి, తిరుచెందూర్ డీఎంకే ఎమ్మెల్యే అనితా ఆర్. రాధాకృష్ణన్ అరెస్టయ్యారు. జూలై మొదటి వారంలో విజయ్‌ను కించపరిచేలా మాట్లాడారనే ఆరోపణలపై టీవీకే కార్యకర్తల ఫిర్యాదుతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన కోర్టు ద్వారా బెయిల్ పైన విడుదలయ్యారు.

Also Read:  కాక్రోచ్ ఫస్ట్ విక్టరీ, కేంద్ర పెద్దలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా..?

బ్యాక్-టు-బ్యాక్ ఇద్దరు ఎమ్మెల్యేల అరెస్టులపై డీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్, ఎంపీ కనిమొళి ఈ చర్యలను తీవ్రంగా ఖండించారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తోందని, పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మరోవైపు, చట్టాన్ని అతిక్రమించి శారీరక దాడులు చేస్తామని బెదిరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని టీవీకే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఏదేమైనా, తమిళనాడులో ‘డీఎంకే వర్సెస్ టీవీకే’ పొలిటికల్ వార్ ఇప్పుడు పీక్స్‌కు చేరింది.

leave a reply