కీలక పోస్టులో అవినీతి అధికారి.. ఏమిటిది బాబు..?

సీఎం చంద్రబాబుకు ఏ శాఖకు, ఏ అధికారిని నియమించాలో తెలియటం లేదా?

Share this :

గొర్రెలు తినే వాడిని పంపేశారు.. కానీ.. బర్రెలు తినే వాడిని రప్పించారా..? ఎంతో అధికార అనుభవం ఉన్న సీఎం చంద్రబాబుకు సచివాలయంలో ఏ శాఖకు, ఏ అధికారిని నియమించాలో తెలియటం లేదా అనే చర్చ ఇప్పుడు సచివాలయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం సమర్థులైన ఐఏఎస్ అధికారులకు కొదవలేదు. కానీ.. కులం కాకి లెక్కలతో సమర్థతను, సీనియారిటిని పక్కన బెట్టి, అసమర్థులను, అవినీతి ఆరోపణలు ఉన్న వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులను కూడా ప్రాధాన్యత గల శాఖాధిపతులుగా నియమించారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు.

Also Read:  ఫ్యూజులు అవుట్.. ‘స్పిరిట్’ ఇంటర్వెల్ ట్విస్ట్‌పై క్రేజీ లీక్..!

ఎలాంటి అధికార అనుభవం లేని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శాఖాధిపతుల నియామకాల్లో అనేక తప్పులు చేసి చేతులు కాల్చుకున్నారు. అపార అధికార అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు కూడా జగన్ మోహన్ రెడ్డి బాటనే అనుసరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు నిర్వహించాల్సిన శాఖల్లో జూనియర్ ఐఏఎస్ అధికారులను నియమించే పద్ధతిని జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా జగన్ బాటనే ఆదర్శం గా తీసుకున్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆ శాఖకు సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించే సాంప్రదాయం ఉండేది. ఆ సాంప్రదాయాన్ని జగన్ మోహన్ రెడ్డి పాటించలేదు. ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా అదే బాటలో నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఇక అసలు విషయం ఏమిటంటే.. సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాల్సిన శాఖాధిపతి పోస్టులో జూనియర్ ఐఏఎస్ అధికారిని నియమించలేదు. దీంతో ఆ శాఖను సమర్ధవంతంగా నిర్వహించ లేకపోవటమే కాదు.. అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు బయటకు పొక్కటంతో.. మీడియా కూడా ఆధారాలతో కధనాలు ప్రచురించటం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన గారిని పక్కన బెట్టి మరో జూనియర్ ఐఏఎస్ అధికారిని నియమించటం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాల్సిన పాలకులు, మళ్లీ అవినీతి ఆరోపణలు ఉన్న జూనియర్ ఐఏఎస్ అధికారినే నియమించటంతో గొర్రెలు తినే వాడు పోయి.. బర్రెలు తినేవాడు వచ్చాడని సచివాలయంలో కధలు, కధలుగా చెప్పుకుంటున్నారు.

Also Read: కాక్రోచ్ ఫస్ట్ విక్టరీ, కేంద్ర పెద్దలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా..?

ఇదే శాఖను ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అనేక సంవత్సరాలు సమర్ధవంతంగా నిర్వహించి పాలకుల మన్ననలు పొందారు. అపార అధికారం అనుభవం, ఏ శాఖకు ఏ అధికారిని నియమించాలో తెలిసిన సీఎం చంద్రబాబు కూడా.. అప్పుడప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు కూడా భంగం కలుగుతుందనే ప్రచారం జరుగుతోంది. కలెక్టర్‌గా ఫ్లాప్ అయ్యారు.. కమీషనర్‌గా, డైరెక్టర్‌గా అట్టర్ ఫ్లాప్ అయిన ఒక జూనియర్ ఐఏఎస్ అధికారిని.. అదికూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్న అధికారిని.. అత్యంత ప్రాధాన్యత గల పోస్టులో నియమించడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

leave a reply