ఫ్యూజులు అవుట్.. ‘స్పిరిట్’ ఇంటర్వెల్ ట్విస్ట్‌పై క్రేజీ లీక్..!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ పక్కా

Share this :

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై ఇటు టాలీవుడ్‌లోనే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ అంచనాలు ఉన్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను ఏ రేంజ్‌లో షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఒక చేత్తో సిగరెట్ కాలుస్తూ.. మరో చేత్తో మందు గ్లాసులో వేలు తిప్పుతూ ప్రభాస్ కనిపించిన రగ్గడ్ లుక్ ఫ్యాన్స్‌కు నెవర్ బిఫోర్ పూనకాలను తెప్పించింది. కాగా, తాజాగా ఈ సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్‌కు సంబంధించిన ఒక నరాలు తెగిపోయే అప్‌డేట్ నెట్టింట జోరుగా వైరల్ అవుతోంది.

Also Read: టీబిజేపి స్వేచ్ఛకు బ్రేకులు..? ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే..!

సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘స్పిరిట్’ కథ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక హై-వోల్టేజ్ ఇన్వెస్టిగేషన్ కేసు చుట్టూ తిరుగుతుందట. అయితే అసలు ట్విస్ట్ ఇంటర్వెల్ బ్లాక్‌లో వస్తుందని సమాచారం. హీరోగా నటిస్తున్న ప్రభాస్ పాత్రకు, సినిమాలో మెయిన్ విలన్‌కు మధ్య ఉండే ఒక ఊహించని షాకింగ్ రిలేషన్ ఇంటర్వెల్ సీన్‌లో రివీల్ అవుతుందట. ఆ సీన్ చూసి థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది. సందీప్ రెడ్డి వంగా మార్క్ రా కంటెంట్, ఇంటెన్స్ ఎమోషన్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

Also Read: కాక్రోచ్ ఫస్ట్ విక్టరీ, కేంద్ర పెద్దలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా..?

ఇప్పటికే దాదాపు 40 శాతం వరకు షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఎలాగైనా ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబేరాయ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. ఈ సినిమాను కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా చైనీస్, జపనీస్, కొరియన్ వంటి అంతర్జాతీయ భాషలతో కలిపి మొత్తం పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయనుండటం విశేషం.

leave a reply