నటసింహం నందమూరి బాలకృష్ణ వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. గత ఏడాది చివర్లో ‘అఖండ-2’ చిత్రంతో థియేటర్లలో అలరించిన ఆయన, ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ చిత్రంలో (NBK 111) నటిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్‌లో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీలో మంచు మనోజ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.
అయితే, ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో ఊహించని విధంగా బాలకృష్ణకు గాయం కావడం, ఏఐజీ (AIG) హాస్పిటల్స్ వైద్యులు ఆయనకు విజయవంతంగా సర్జరీ చేయడంతో ప్రస్తుతం ‘NBK 111’ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గోపీచంద్ మలినేని చిత్రంతో పాటు టాలీవుడ్ స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ తన 112వ చిత్రానికి (NBK 112) శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గత నెలలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. అయితే, బాలయ్యకు సర్జరీ జరిగి ప్రస్తుతం బెడ్ రెస్ట్ అవసరం కావడంతో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ షెడ్యూల్ కూడా వాయిదా పడింది.
మొదట ఆగస్టు చివరి వారంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన షెడ్యూల్‌ను ప్రారంభించాలని చిత్రబృందం భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితి కారణంగా ఈ షూటింగ్‌ను సెప్టెంబర్ రెండో వారానికి వాయిదా వేశారట. ఈ క్రమంలో సమయం ఏమాత్రం వృథా కాకూడదని భావించిన దర్శకుడు కొరటాల శివ ఒక పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. బాలకృష్ణ లేని కీలక సన్నివేశాలను, ఇతర నటీనటులపై వచ్చే సీన్లను ముందుగా చిత్రీకరించి, ఆయన పూర్తిగా కోలుకుని సెట్స్‌పైకి వచ్చిన తర్వాత బాలయ్య సీన్లను ప్లాన్ చేయాలని నిర్ణయించారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ తెగ వైరల్ అవుతోంది. సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ఒక కీలక పాత్రలో మెరవనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఆమె రెగ్యులర్ హీరోయిన్ కాదట. కథను మలుపు తిప్పే ఒక పవర్‌ఫుల్ ‘నెగిటివ్ షేడ్స్‘ (విలన్) ఉన్న క్యారెక్టర్‌లో బాలయ్యను ఢీకొట్టబోతోందనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో బాలయ్య కెరీర్‌లోనే మైల్ స్టోన్‌గా నిలిచిన ‘సింహా’ చిత్రానికి కొరటాల శివ రైటర్‌గా అద్భుతమైన డైలాగులు అందించారు. ఇప్పుడు ఏకంగా ఆయనే డైరెక్ట్ చేస్తుండటం, దానికి తోడు ఐశ్వర్య రాజేష్ నెగిటివ్ రోల్ గాసిప్ తోడవడంతో.. ఈ సినిమా ఖచ్చితంగా ‘సింహా’ రేంజ్‌లోనే థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి