తేజస్విని నందమూరి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ..?

సిగ్నల్స్ ఇస్తోన్న నందమూరి వారసురాలు

Share this :

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) చిన్న కుమార్తె తేజస్విని నందమూరి ఇటీవల సోషల్ మీడియాలో తన అద్భుతమైన డాన్స్ వీడియోలతో సెన్సేషన్ సృష్టిస్తున్నారు. నిన్ననే ఆమె విడుదల చేసిన ‘సారంగ దరియా’ డాన్స్ వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.. గతంలో ఒక ఫాస్ట్ బీట్ సాంగ్‌కు కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి స్టెప్పులేసిన తేజస్విని, ఇప్పుడు ‘సారంగ దరియా’ సాంగ్‌కు చూపించిన గ్రేస్, ఎనర్జీ చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. “తండ్రి పోలికలు వచ్చాయి.. బాలయ్య లాగే డాన్స్‌లో టైమింగ్ అదిరిపోయింది” అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: ద్రావిడ్‌కు ఇంగ్లండ్ టెస్ట్ కోచ్ ఆఫర్..?

నిజానికి ఈ డాన్స్ వీడియోల వెనుక ఒక పెద్ద ప్లానింగ్ ఉందనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే తేజస్విని కేవలం డాన్స్ మాత్రమే కాదు, గత కొంతకాలంగా బాలయ్య బాబు సినిమా ప్రాజెక్టులను సింగిల్ హ్యాండ్‌తో హ్యాండిల్ చేస్తున్నారు. ముఖ్యంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ సినిమా నుంచి బాలకృష్ణ సినిమాలపై ఆమె కంప్లీట్ ఫోకస్ పెట్టారు. బాలయ్య బాబు డిజిటల్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ సూపర్ సక్సెస్ కావడం వెనుక కూడా తేజస్విని క్రియేటివ్ మేనేజ్‌మెంట్ ఎంతో ఉంది. ప్రస్తుతం బాలయ్య దగ్గరకు వచ్చే ప్రతి కథను మొదట తేజస్విని గారే వింటున్నారట. లైన్, స్క్రిప్ట్, క్యారెక్టరైజేషన్ ఆమెకు నచ్చితేనే ఆ ప్రాజెక్ట్‌ను బాలయ్య ఓకే చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్.

Also Read: టీడీపీ దురంధర్ గా మారిపోయిన జగన్..!

కథల ఎంపికపై పట్టు సాధించిన తేజస్విని, ఇప్పుడు స్వయంగా వెండితెరపైకి రావాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం బాలకృష్ణతో సినిమాలు చేయడానికి ఇద్దరు స్టార్ డైరెక్టర్లు లైన్‌లో ఉన్నారు. ఒకరు ఆల్రెడీ బాలయ్యకు ‘వీరసింహారెడ్డి’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాగా, మరొకరు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. ఈ ఇద్దరిలో ఒకరి దర్శకత్వంలో రాబోయే బాలకృష్ణ సినిమాలో తేజస్విని ఒక అత్యంత కీలకమైన, పవర్‌ఫుల్ పాత్ర ద్వారా ప్రేక్షకులను పలకరించే అవకాశాలు మెండుగా ఉన్నాయట. నందమూరి ఫ్యామిలీ నుండి కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి లైన్ క్లియర్ అవుతుండగా, కూతురు తేజస్విని కూడా ఈ రేంజ్‌లో యాక్టివ్ అవ్వడం ఫ్యాన్స్‌కు డబుల్ జోష్ ఇస్తోంది.

leave a reply