సోషల్ మీడియాలో ‘ప్రశ్న రావణ్’గా పాపులర్ అయిన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అరెస్ట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఆది నుంచి ప్రశ్న రావణ్‌కు మద్దతుగా నిలుస్తూ, అతని బెయిల్ కోసం న్యాయపోరాటం చేసిన దళిత సంఘాల నేత, ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ఇప్పుడు ఊహించని విధంగా యూ-టర్న్ తీసుకున్నారు. ప్రశ్న రావణ్‌పై అత్యంత కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA – ఉపా) కింద కేసు నమోదు కావడంతో జడ శ్రవణ్ కుమార్ తన మాట మార్చడం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది.
గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ప్రశ్న రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు జడ శ్రవణ్ కుమార్ గట్టిగా స్పందించారు. ఇది ప్రభుత్వ కక్షసాధింపు చర్య అని, ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారంటూ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ పోలీసుల తీరును తప్పుబట్టారు. అంతేకాకుండా పిఠాపురం కోర్టులో ప్రశ్న రావణ్‌కు బెయిల్ ఇప్పించడంలో కూడా న్యాయవాదిగా ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైతే గన్నవరం పోలీసులు ప్రశ్న రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద దేశద్రోహ కేసులు నమోదు చేశారో, అప్పటి నుంచి ఈ కేసు స్వరూపమే మారిపోయింది.
రావణ్ మొబైల్ ఫోన్‌లో నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలు, దేశభద్రతకు ముప్పు కలిగించే కంటెంట్ లభించిందని పోలీసులు కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. ఉపా చట్టం కింద కేసు నమోదైతే ఇప్పట్లో బెయిల్ రావడం అసాధ్యమని, కనీసం కొన్ని సంవత్సరాల పాటు జైలు నుంచి బయటకు రావడం కష్టమనే పూర్తి క్లారిటీ రావడంతో జడ శ్రవణ్ కుమార్ అలర్ట్ అయ్యారు. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో జడ శ్రవణ్ కుమార్ సంచలనంగా మాట మార్చారు.
ఒకప్పుడు వెనకేసుకొచ్చిన ప్రశ్న రావణ్‌పైనే ఇప్పుడు ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దేశభద్రత, ఉగ్రవాద సిద్ధాంతాల లాంటి తీవ్రమైన అంశాల్లో తాము రాజీ పడబోమని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరూ మద్దతు ఇవ్వరని స్పష్టం చేస్తున్నారు. కేసు తీవ్రతను అర్థం చేసుకుని, లీగల్‌గా ఇందులో తలదూర్చితే తమకే ఇబ్బందులు వస్తాయని భావించిన శ్రవణ్ కుమార్.. సైలెంట్‌గా ఈ వివాదం నుండి సైడ్ అయిపోయారు. మొత్తానికి ‘ఉపా’ చట్టం దెబ్బకు జడ శ్రవణ్ కుమార్ తీసుకున్న ఈ యూ-టర్న్ పొలిటికల్ అండ్ లీగల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి