సాయి పల్లవి రెమ్యునరేషన్ వింటే మైండ్ బ్లాక్..!

సౌత్ ఇండియాను ఊపేస్తున్న స్టార్ హీరోయిన్ సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ

Share this :

తన సహజసిద్ధమైన నటనతో సౌత్ ఇండియాను ఊపేస్తున్న స్టార్ హీరోయిన్ సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీతో సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ సుమారు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆధ్యాత్మిక దృశ్యకావ్యం రామాయణంలో ఆమె సీతాదేవి పాత్రను పోషిస్తోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ పౌరాణిక చిత్రం కోసం సాయిపల్లవి ఏకంగా రూ. 20 కోట్ల భారీ పారితోషికాన్ని అందుకుంటున్నట్లు సమాచారం.

Also Read: ప్రధాన్ తర్వాత సీజేపి నెక్స్ట్ టార్గెట్ ఆయనేనా..?

అంటే ఒక్కో భాగానికి రూ. 10 కోట్ల చొప్పున ఆమెకు రెమ్యునరేషన్ లభించనుంది. దక్షిణాది చిత్రసీమకు చెందిన ఒక హీరోయిన్‌ కు ఈ స్థాయిలో పారితోషికం దక్కడం అత్యంత అరుదైన విషయంగా సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల న్యూఢిల్లీలో ఎంతో వైభవంగా జరిగిన ప్రథమ్ సంకల్ప్ వేడుకలో సాయిపల్లవి తన పాత్ర గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘సీతాదేవి పాత్రను నేను స్వయంగా సాధించుకోలేదు.. ఆ సీతమ్మ తల్లే నన్ను ఈ పాత్ర కోసం ఎంచుకుంది’ అని ఆమె పేర్కొన్నారు.

Also Read: రోజా మౌనం వెనుక సీఎంఓ అధికారి..?

వెండితెరపై అంతటి పవిత్రమైన పాత్రను పోషించే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని, ప్రతి సన్నివేశంలోనూ తన అభినయం సహజంగా రావాలని షూటింగ్ సమయంలో నిత్యం ప్రార్థించేదాన్నని తెలిపారు. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, కన్నడ స్టార్ యష్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా ప్లాన్ చేయడమే కాకుండా.. బాలీవుడ్, సౌత్ కాంబినేషన్ లో నటులను సెలెక్ట్ చేసింది చిత్ర యూనిట్.