ఓటీటీ సినిమాలకు సెన్సార్ కష్టాలు..?

సినిమాలకు కేంద్ర ప్రభుత్వం షాక్..?

Share this :

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలయ్యే సినిమాల కంటెంట్‌పై నియంత్రణను మరింత కఠినతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రముఖ పంజాబీ నటుడు, సింగర్ దిల్జిత్ దోసాంజ్ నటించిన ‘సత్లుజ్’ (Satluj) సినిమా చుట్టూ ముసురుకున్న వివాదం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీయడంతో, థియేటర్ల మాదిరిగానే నేరుగా ఓటీటీలలో విడుదలయ్యే చిత్రాలకు కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అనుమతిని తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా డిజిటల్ మీడియా నిబంధనలను (IT Rules) సవరించేందుకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది.

Also Read: పలాస హిట్ అండ్ రన్ కేసు.. అప్పలరాజు అరెస్ట్ కు సిద్దం..?

వాస్తవానికి మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, గత మూడు సంవత్సరాలుగా సెన్సార్ బోర్డు వద్ద పెండింగ్‌లోనే ఉండిపోయింది. గతంలో ‘ఘల్లుఘారా’ మరియు ‘పంజాబ్ 95’ అనే పేర్లతో ప్రచారం పొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏకంగా 127 కట్లు (Cuts) ప్రతిపాదించడంతో వివాదం రేగింది. చివరకు ఈ నెల మొదట్లో (జూలై 3) జీ5 (ZEE5) ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ఒరిజినల్ వెర్షన్ నేరుగా స్ట్రీమింగ్ అయినప్పటికీ, కేంద్రం అభ్యంతరాల వ్యక్తం చేయడంతో కేవలం 48 గంటల్లోనే ఆ ప్లాట్‌ఫారమ్ నుండి సినిమాను తొలగించాల్సి వచ్చింది.

Also Read: గమన అరెస్ట్ కు రంగం సిద్దం..?

సినిమాను ఓటీటీ నుండి తొలగించినప్పటికీ, పలు రాష్ట్రాల్లో గురుద్వారాలు మరియు కమ్యూనిటీ వేదికలపై ఈ సినిమాను ప్రదర్శిస్తుండటంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. సర్టిఫికేషన్ లేని సినిమాల ప్రదర్శనను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖలు రాయడమే కాకుండా, భవిష్యత్తులో డిజిటల్ కంటెంట్‌కు కూడా థియేటర్ సినిమాల తరహాలోనే సెన్సార్ నిబంధనలు వర్తింపజేయాలని చూస్తోంది. ఒకవేళ ఈ మార్పులు చట్టబద్ధంగా అమల్లోకి వస్తే, ఓటీటీల కోసం సినిమాలు తీసే మేకర్లు కూడా ఇకపై ఖచ్చితంగా సెన్సార్ బోర్డు చుట్టూ తిరగక తప్పదు.

leave a reply