వన్డే ప్రపంచకప్ 2027పై బీసీసీఐ కన్ను.!

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు దేప్ దాస్‌గుప్తా వార్నింగ్

Share this :

భారత క్రికెట్ జట్టులో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై గత కొంతకాలంగా నెట్టింట తీవ్రమైన చర్చ నడుస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, సెలెక్టర్లు వీరిద్దరూ లేని ఒక కొత్త ప్రణాళికను సిద్ధం చేసే యోచనలో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ లార్డ్స్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో సెంచరీతో రాణించగా, విరాట్ కోహ్లీ రెండు హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ దేప్ దాస్‌గుప్తా వీరిద్దరికీ ఒక కీలకమైన హెచ్చరిక జారీ చేశారు.

Also Read: పిఠాపురంపై గురి పెట్టిన పవన్.. కీలక ఆదేశాలు..!

దేప్ దాస్‌గుప్తా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. రోహిత్, కోహ్లీలు సిరీస్ ప్రారంభం నుంచే అద్భుతంగా రాణించాల్సి ఉంటుందని, ఫామ్‌లోకి రావడానికి ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల సమయాన్ని తీసుకోకూడదని స్పష్టం చేశారు. అయితే జట్టులో వారి స్థానాల గురించి ఎటువంటి చర్చలు అవసరం లేదని, వారి గత ప్రదర్శనల ఆధారంగానే వారు జట్టులో కొనసాగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రోహిత్ స్థానాన్ని యశస్వి జైస్వాల్‌తో భర్తీ చేయవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయని ఆయన ప్రస్తావించారు.

 Also Read: బొండా అంతర్యం ఏంటీ..? ఎందుకు ఎదురు తిరిగినట్టు..?

వీరి భవిష్యత్తుపై ఇంతగా చర్చ జరగడానికి గల ప్రధాన కారణం వారు ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతుండటమేనని దాస్‌గుప్తా విశ్లేషించారు. వేర్వేరు ఫార్మాట్లు ఆడేటప్పుడు ఒకదానిలో విఫలమైనా మరొకదానిలో రాణిస్తే పాత వైఫల్యాలను మర్చిపోతారని, కానీ కేవలం ఒకే ఫార్మాట్ ఆడేటప్పుడు వారు ఆఖరి మ్యాచ్‌లో ఏం చేశారనేదే అందరూ గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు. అందువల్ల రాబోయే సిరీస్‌ లలో మొదటి మ్యాచ్ నుంచే వారు దూకుడు ప్రదర్శించడం అత్యంత అవసరమని ఆయన సూచించారు.