లక్ష్మణ్ కే కోచింగ్ బాధ్యతలు..?

టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..?

Share this :

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమిండియా కోచింగ్ విభాగంలో ఒక కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. జాతీయ క్రికెట్ అకాడమీ అధినేత, భారత మాజీ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) తిరిగి టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. భారత్ త్వరలోనే పర్యటించబోయే జింబాబ్వే టీ20 సిరీస్‌తో పాటు ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్ (Asian Games 2026) కు కూడా లక్ష్మణ్ భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తారని బోర్డు వర్గాల ద్వారా స్పష్టమైంది. లక్ష్మణ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్‌గా హృషికేశ్ కనిత్కర్, బౌలింగ్ కోచ్‌గా సునీల్ జోషి సపోర్ట్ స్టాఫ్‌గా వ్యవహరించనున్నారు.

Also read: ట్రంప్‌ను లేపేయడానికి ఇరాన్ ‘కిల్-ప్లాట్’..?

ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో టీమిండియా వరుసగా ఎదుర్కొన్న పరాజయాల నేపథ్యంలో ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్‌పై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో ఈ వార్త రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, గంభీర్‌ను పూర్తిగా పదవి నుంచి తొలగించలేదని.. బిజీ ఇంటర్నేషనల్ షెడ్యూల్ కారణంగానే బీసీసీఐ ఈ ‘స్ప్లిట్ కోచింగ్’ విధానాన్ని అమలు చేస్తోందని అంతర్గత సమాచారం. ఏషియన్ గేమ్స్ జరిగే సమయంలోనే భారత్‌లో వెస్టిండీస్‌తో సిరీస్ జరగనుంది.

Also Read: ఎమ్మెల్యే వర్సెస్ కార్యకర్త.. జనసేనలో వింత వాతావరణం..!

ఆ సమయంలో రెగ్యులర్ కోచ్ గౌతమ్ గంభీర్ సీనియర్ జట్టుతోనే కొనసాగుతారని, జింబాబ్వే మరియు జపాన్ (ఏషియన్ గేమ్స్) వెళ్లే యువ భారత జట్టును లక్ష్మణ్ నడిపిస్తారని అధికారులు స్పష్టం చేశారు. భారత ద్వితీయ శ్రేణి జట్టుకు లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రాహుల్ ద్రావిడ్ ప్రధాన జట్టుతో ఉన్నప్పుడు కూడా లక్ష్మణ్ పలుమార్లు ఆపద్ధర్మ కోచ్‌గా వ్యవహరించి విజయవంతమైన ట్రాక్ రికార్డును నమోదు చేశారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో, మయాంక్ యాదవ్ లాంటి యువ ఆటగాళ్లతో కూడిన ఈ సరికొత్త జట్టును లక్ష్మణ్ తన ప్రశాంతమైన శైలితో ఎలా గెలిపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

leave a reply