గంభీర్ ఫైర్: ఇది సంక్షోభం కాదు.. కేవలం ‘రీసెట్’ మాత్రమే..!

టైం ఇవ్వండి, గంభీర్ కామెంట్స్

Share this :

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో భారత టీ20 జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలను చవిచూడటంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ లైనప్ దారుణంగా కుప్పకూలింది. జోష్ టంగ్, జోఫ్రా ఆర్చర్ వేసిన నిప్పులు చెరిగే పేస్ బౌలింగ్‌కు సమాధానం లేక.. 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది. ఏకంగా 125 పరుగుల రికార్డు తేడాతో ఎదురైన ఈ పరాజయంపై గంభీర్ స్పందిస్తూ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

Also Read: దుమారం రేపుతున్న బోండా ఉమా వ్యాఖ్యలు..

జట్టు ఎదుర్కొంటున్న ఈ గడ్డుకాలాన్ని తానేమీ సంక్షోభంగా భావించడం లేదని, ఇదొక సాధారణ ‘రీసెట్’ (మార్పు ప్రక్రియ) మాత్రమేనని గంభీర్ స్పష్టం చేశారు. “ఒక సరికొత్త జట్టును నిర్మించే క్రమంలో ఇలాంటి ఘోర పరాజయాలు సహజంగానే ఎదురవుతాయి. ఇంగ్లండ్ లాంటి నాణ్యమైన జట్టుతో తలపడుతున్నప్పుడు యువ ఆటగాళ్లకు ఎదగడానికి కొంత సమయం, స్వేచ్ఛ ఇవ్వాలి. రాత్రికి రాత్రే అద్భుతమైన ఫలితాలను ఆశించలేం” అని ఆయన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

వేగవంతమైన పిచ్‌లపై పదునైన ఫాస్ట్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో మన బ్యాటర్లు ఇంకా నేర్చుకోవాల్సి ఉందంటూ గంభీర్ నిజాయితీగా అంగీకరించారు. ఈ మ్యాచ్ కేవలం మన బ్యాటర్లకు ఒక బ్యాడ్ డే మాత్రమేనని, మొదటి రెండు టీ20ల్లో జట్టు 190 వరకు పరుగులు చేసిందని గుర్తుచేశారు. అలాగే టీ20 క్రికెట్‌లో కేవలం ప్రతిభ మాత్రమే సరిపోదని, పిచ్ పరిస్థితులు, బౌండరీల పరిమాణం, గాలి తీవ్రత వంటి సూక్ష్మ విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆటను సరిగ్గా రీడ్ చేయడం అలవాటు చేసుకోవాలని ఆటగాళ్లకు సూచించారు.

Also Read: హాస్టళ్లపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.!

ఈ పరాజయంలోనూ యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ ప్రదర్శన తనను ఆకట్టుకుందని గంభీర్ ప్రశంసించారు. పవర్‌ప్లే మరియు డెత్ ఓవర్లలో ఒత్తిడిని అధిగమించి అతడు వేసిన తీరు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తోందన్నారు. ప్రస్తుతం ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుండటంతో, భారత్ సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే నేడు (గురువారం) బ్రిస్టల్‌లో జరగబోయే నాలుగో టీ20 మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

leave a reply