రోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!

నిప్పు లేనిదే పొగ రాదు

Share this :

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై ఇటీవల సోషల్ మీడియాలో, క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ వరుసగా తక్కువ పరుగులకే అవుట్ కావడంతో, లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేనే ఈ ఫార్మాట్‌లో అతనికి చివరి మ్యాచ్ కానుందంటూ, సెలెక్టర్ల ప్రణాళికల్లో అతను లేడంటూ కథనాలు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలకు తెరదించుతూ లార్డ్స్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 138 పరుగులతో అద్భుతమైన సెంచరీ బాది, తనేంటో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు.

Also Read: ఒక్కడి కోసం కేంద్రం ఇమేజ్ పణంగా పెడుతున్నారా..?

ఈ రిటైర్మెంట్ వివాదం మరియు వచ్చిన కథనాలపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ రిటైర్మెంట్ గురించిన వార్తలను కేవలం బయట వినిపించే పుకార్లుగా లేదా మీడియా సృష్టిగా కొట్టిపారేయలేమని అశ్విన్ అన్నాడు. ఈ సందర్భంగా తమిళంలో ఒక ప్రసిద్ధ సామెతను గుర్తు చేస్తూ.. “నిప్పు లేనిదే పొగ రాదు “ అని వ్యాఖ్యానించాడు. ఆ రూమర్ల వెనుక ఏదో ఒక గట్టి విషయమే ఉండి ఉంటుందని, లోపల ఏదో జరిగిందని అభిప్రాయపడ్డాడు.

కానీ రోహిత్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆ చర్చలన్నింటికీ తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ పెట్టాడని తెలిపాడు. రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటే, అతను 2027 వన్డే ప్రపంచకప్ ఆడటంలో ఎలాంటి సందేహం లేదని మరియు అతని మైండ్‌లో కూడా అదే స్పష్టత ఉందని అశ్విన్ పేర్కొన్నాడు. ఒకవేళ గాయం తర్వాత రోహిత్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండి ఉంటే, లార్డ్స్ మ్యాచ్‌లో 180 పరుగులు చేసి జట్టును ఒంటరి చేత్తో గెలిపించేవాడని, ప్రస్తుతం అతను మంచి ఫామ్‌లో ఉన్నాడని అశ్విన్ ప్రశంసించాడు.

Also Read: దేశ రాజధానిలో అసలేం జరుగుతోంది?

అంతేకాకుండా, విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మలను(Rohit Sharma) జట్టు నుంచి తప్పించడం బిసిసిఐ (BCCI) లేదా సెలెక్టర్లకు అంత సులువైన విషయం కాదని అశ్విన్ స్పష్టం చేశాడు. భారత క్రికెట్‌కు వారు అందించిన అసాధారణ సేవలు, సాధించిన రికార్డులే వారిని కాపాడుతాయన్నాడు. ముఖ్యంగా రోహిత్ వన్డేల్లో దాదాపు 12,000 పరుగులు చేశాడని, అలాంటి ఆటగాళ్లను ముట్టడం ఎవరికీ సాధ్యం కాదని తెలిపాడు. వారికంటూ దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల సైన్యం ఉందని, ఒకవేళ వారిని బలవంతంగా జట్టు నుంచి తొలగిస్తే స్టేడియం కప్పులు తెగిపడేలా అభిమానుల నుండి తీవ్రమైన వ్యతిరేకత మరియు నిరసనలు ఎదురవుతాయని అశ్విన్ విశ్లేషించాడు.