యుద్ధం మళ్ళీ షురు.. ట్రంప్ భీకర ప్లాన్..!

చరిత్రలో చూడని దాడులు

Share this :

పశ్చిమాసియా (Middle East) ప్రాంతంలో యుద్ధ జ్వాలలు అత్యంత భయానక స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ ఎదుర్కొనేందుకు వాషింగ్టన్‌ వద్ద ఉన్న సాధారణ సైనిక ప్రత్యామ్నాయాలన్నీ ముగిసిపోతున్నాయంటూ అంతర్జాతీయంగా ఊహాగానాలు సాగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా ఇరాన్ సైనిక స్థావరాలపై అత్యంత శక్తివంతమైన వైమానిక దాడులకు ఆదేశాలు జారీ చేశారు. నాటో (NATO) సదస్సు కోసం టర్కీ పర్యటనలో ఉన్న ట్రంప్.. అక్కడ నుంచే ఈ ప్రత్యేక ఆపరేషన్‌ ప్లాన్‌ను ఆమోదించడం గమనార్హం.

హోర్ముజ్ జలసంధి సమీపంలో వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ‘శిక్ష’గా.. గతంలో కంటే 4 నుంచి 5 రెట్లు పెద్ద ఎత్తున, మునుపెన్నడూ లేనంత శక్తివంతంగా ఈ తాజా దాడులను అమెరికా సైన్యం చేపట్టిందని అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణానంతరం లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి భారీ అంత్యక్రియల ఊరేగింపుల్లో పాల్గొంటున్న తరుణంలోనే అమెరికా ఈ భీకర దాడులకు దిగింది.

Also Read: హాస్టళ్లపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.!

ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు (Air Defenses), ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి కేంద్రాలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలు, యాంటీ-షిప్ క్రూయిజ్ మిస్సైల్ సైట్లు, నౌకాశ్రయాలు మరియు డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను లక్ష్యంగా చేసుకుని అమెరికా బాంబర్లు విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా ఇరాన్ వ్యూహాత్మక నౌకాశ్రయ నగరాలైన బందర్ అబ్బాస్, సిరిక్‌లతో పాటు క్విష్మ్ ఐలాండ్ పరిధిలో కనీసం 10కి పైగా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయిందని సమాచారం.

ఇరాన్ దాడులకు గురికావడంతో ఇరాక్ పర్యటనలో ఉన్న ప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ తన కార్యక్రమాలను రద్దు చేసుకుని అత్యవసరంగా టెహ్రాన్‌కు తిరుగుపయనమయ్యారు. సైనిక దాడులతో పాటు ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు అమెరికా మరో వ్యూహాత్మక అడుగు వేసింది. హోర్ముజ్ జలసంధి పరిధిలోని ఓమన్ తీరంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినందుకు గాను.. ఇరాన్ ముడి చమురు (Crude Oil) విక్రయాలపై భారత్ వంటి దేశాలకు గతంలో ఇచ్చిన తాత్కాలిక ఆంక్షల మినహాయింపు (Temporary Sanctions Waiver) ను వాషింగ్టన్ తక్షణమే రద్దు చేసింది.

Also Read: సంజుని తప్పించడంపై గంభీర్ రియాక్షన్ ఇదే..!

ఇది అంతర్జాతీయంగా చమురు రవాణా మరియు మార్కెట్ సమీకరణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్ అంతర్జాతీయ నౌకలపై దాడులకు దిగుతూ తమ మాట వినడం లేదు కాబట్టే.. తాము ఈ విధంగా ‘వాల్యూమ్ పెంచాల్సి వచ్చిందని’ (దాడుల తీవ్రతను పెంచామని) అమెరికా ఉన్నతాధికారి ఒకరు విలేకరుల సమావేశంలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కేవలం మూడు వారాల క్రితమే ఇరు దేశాల మధ్య కుదిరిన శాంతి అవగాహన ఒప్పందాన్ని (MoU) అమెరికా ఈ దాడుల ద్వారా ఘోరంగా ఉల్లంఘించిందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాద్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల వల్ల తలెత్తే పరిణామాలకు పూర్తిగా అమెరికా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరాన్ విదేశాంగ శాఖ హెచ్చరించింది.

leave a reply