Uttar Pradesh Horror: పగా.. ప్రతీకారమా? పట్టపగలు హత్యాచార బాధితురాలిని నడిరోడ్డుపై నరికి చంపిన వైనం

అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై వెంటాడి యువతి దారుణ హత్య

Share this :

Uttar Pradesh Horror లక్నో, నవంబర్ 21: పట్టపగలు.. అందరూ చూస్తుండగా.. నడిరోడ్డుపై ఓ యువతి అత్యంత దారుణంగా హత్య (murder case)కు గురైంది. మూడేళ్ల క్రితం అత్యాచారానికి గురైన మైనర్‌ బాలిక (ప్రస్తుతం 19 యేళ్లు)ను చంపేందుకు కొద్దిరోజుల క్రితమే నిందితుడు బెయిల్‌ (Bail)పై జైలు నుంచి బయటకు వచ్చాడు.

లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరించిందనే అక్కసుతో రోడ్డుపై వెంటాడి మరీ యువతిని దారుణంగా హతమార్చాడు. ఇద్దరు సోదరులు ఆమెను రోడ్డుపై తరిమి.. తరిమి హతమార్చారు. ఈ షాకింగ్‌ (Uttar Pradesh horror) ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని కౌశాంబి జిల్లా దేర్హా గ్రామంలో మంగళవారం (నవంబర్ 21) చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

నిందితుడు పవన్‌ నిషద్, అతని స్నేహితుడైన అశోక్ నిషద్ కొద్దిరోజుల క్రితమే బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. పవన్‌ మూడేళ్ల క్రితం మైనర్ బాలికను హత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను కటకటాల వెనుక వేశాడు. అప్పటి నుంచి కేసు వెనక్కి తీసుకోవాలని నిందితులు బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని వేధిస్తూనే ఉన్నాడు. అందుకు వారు అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు.

ఈ క్రమంలో తాజాగా బెయిల్‌పై బయటికి వచ్చిన పవన్‌, మరో కేసులో విడుదలైన అశోక్‌ నిషద్‌తో కలిసి పశువులు కాసుకొని ఇంటికి తిరిగివస్తోన్న 19 ఏళ్ల యువతిని నడిరోడ్డుపై వెంటాడి గొడ్డలితో గొంతు నరికి చంపారు. హత్య జరిగిన సమయంలో అక్కడున్నవారంతా భయంతో వణికిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు కేసు నమోదు చేసుకుని యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు కౌశాంబి ఎస్పీ బ్రిజేష్ శ్రీవాస్తవ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.