అంతర్జాతీయ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక అత్యంత అరుదైన, షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌తో యుద్ధ వాతావరణం ముదరడం, దౌత్యపరమైన చర్చలు పూర్తిగా విఫలం కావడంతో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత కొడుకు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. పామ్ బీచ్ సోషలైట్ బెట్టీనా అండర్సన్‌తో డాన్ జూనియర్ వివాహం ఈ వీకెండ్లోనే జరగాల్సి ఉంది. అయితే ఇరాన్‌పై సరికొత్తగా భారీ సైనిక దాడులు (Fresh Military Action) చేయడానికి అమెరికా రక్షణ వ్యూహాలు సిద్ధం చేస్తుండటంతో, ట్రంప్ తన కుటుంబ వేడుక కంటే దేశ రక్షణే ముఖ్యమని ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also read: Payyavula Keshav: అది రాజారెడ్డి పాపల చరిత్ర, మంత్రి పయ్యావుల సంచలన కామెంట్స్..!
ఈ విషయమై ప్రెసిడెంట్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ (Truth Social) సోషల్ మీడియా ఖాతాలో ఒక పవర్ఫుల్ నోట్ పోస్ట్ చేశారు. “నా కొడుకు డాన్ జూనియర్, కోడలు బెట్టీనాల వివాహ వేడుకకు హాజరవ్వాలని నేను ఎంతగానో ఆశపడ్డాను. కానీ ప్రస్తుతం ఇరాన్ సరిహద్దుల్లో నెలకొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితులు, దేశంపై నాకున్న బాధ్యత నన్ను వాషింగ్టన్ వదిలి వెళ్లనివ్వడం లేదు. ఇలాంటి ఉద్రిక్త సమయాల్లో ప్రెసిడెంట్ హోదాలో నేను వైట్‌హౌస్ లోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షించాల్సి ఉంది. అందుకే కొడుకు పెళ్లిని వాయిదా వేస్తున్నాం” అని ట్రంప్ స్పష్టం చేశారు.
Also read: Summer Heat: తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ సెగ..? గుడ్ల కొరత తప్పదా..?
నిన్న వైట్‌హౌస్ ప్రెస్ మీట్ లో కూడా మీడియా ప్రతినిధులు దీనిపై ప్రశ్నించగా.. “ఇది పెళ్లిళ్లకు సరైన సమయం కాదు, అక్కడ ఇరాన్ తో పెద్ద సమస్య నడుస్తోంది” అని ట్రంప్ సూటిగా సమాధానమిచ్చారు. నిజానికి శుక్రవారం ఉదయం వైట్‌హౌస్ లో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ లతో ట్రంప్ అత్యవసర రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇరాన్ పై ప్రత్యామ్నాయ సైనిక చర్యల (Military Contingency Plans) పై ఈ మీటింగ్ లో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ బ్రీఫింగ్ ముగిసిన వెంటనే ట్రంప్ తన వీకెండ్ షెడ్యూల్ మొత్తాన్ని మార్చేసి, కొడుకు పెళ్లిని వాయిదా వేయడం గమనార్హం. ఒక అంతర్జాతీయ యుద్ధ భయం కారణంగా ఏకంగా అమెరికా అధ్యక్షుడే తన కొడుకు పెళ్లిని వాయిదా వేసుకోవడం ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
