హాస్టళ్లపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.!

హాస్టల్స్ కాదు ఇక గురుకులాలే

Share this :

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ శాఖలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై రాష్ట్రంలో సాధారణ సంక్షేమ హాస్టళ్ల నిర్మాణాలకు స్వస్తి పలికి, వాటి స్థానంలో అత్యాధునిక వసతులతో కూడిన ‘గురుకుల పాఠశాలల’ (రెసిడెన్షియల్ స్కూల్స్) ను మాత్రమే నిర్మించాలని అధికారులను ఆదేశించారు. నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.

Also Read: సంజుని తప్పించడంపై గంభీర్ రియాక్షన్ ఇదే..!

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరియు మైనార్టీ వర్గాలకు చెందిన మెరిట్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీని ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, సంక్షేమ శాఖల పరిధిలోని విద్యాసంస్థల్లో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను (Alumni) ఒకచోటకు చేరుస్తూ ఒక ప్రత్యేక నెట్‌వర్కింగ్‌ను ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రస్తుత విద్యార్థులకు వారి మార్గదర్శకత్వం లభిస్తుందని సీఎం సూచించారు.

Also Read: విజయవాడలో ఎన్‌ఐఏ అలజడి, అసలేం జరుగుతోంది..?

రాష్ట్రవ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల మరమ్మత్తుల కోసం తక్షణమే రూ. 100 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. భవనాల ఆధునికీకరణతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. బడుగు, బలహీన వర్గాల జీవనోపాధిని మరింత మెరుగుపరిచేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను ప్రతిష్టాత్మక ‘పీ4’ (P4 – Public Private People Partnership) విధానంతో అనుసంధానం చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

leave a reply