హెచ్-1బీ వీసాలపై అమెరికా ఉక్కుపాదం.. జేడీ వెన్స్ సంచలన వార్నింగ్

హెచ్-1బీ వర్క్ వీసాల పై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్ ఘాటైన వ్యాఖ్యలు

Share this :

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించి స్థిరపడాలని కలలుగనే విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ రంగానికి ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. హెచ్-1బీ వర్క్ వీసాల దుర్వినియోగంపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్ అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. “అమెరికా ఉద్యోగాలు అమెరికన్ కార్మికుల కోసమే, విదేశీ మోసగాళ్ల కోసం కాదు” అంటూ ఆయన సంచలన హెచ్చరిక జారీ చేశారు. హెచ్-1బీ వీసా వ్యవస్థను మేనేజ్ చేస్తూ, అమెరికా చట్టాలను పక్కదారి పట్టిస్తున్న కంపెనీలను, వ్యక్తులను ఏరిపారేయడానికి ట్రంప్ ప్రభుత్వం చరిత్రలోనే అతిపెద్ద ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్‌ను ప్రారంభించింది.

Also Read: కొరియాలో లోకేష్ సూపర్ స్పీడ్..!

ఈ ప్రకటనకు తగ్గట్టుగానే అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ఇప్పటికే రంగంలోకి దిగి యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. హెచ్-1బీ మరియు పెర్మ్ వీసా కేటగిరీలలో జరుగుతున్న అక్రమాలపై ఇన్వెస్టిగేషన్ చేస్తూ పలు కంపెనీలకు అధికారికంగా సబ్‌పోనాల్ (కోర్టు నోటీసుల లాంటివి) జారీ చేయడం ప్రారంభించింది. ఈ దర్యాప్తులో ఐటీ దిగ్గజం అయిన కాగ్నిజెంట్ లాంటి పెద్ద కంపెనీల పేర్లు కూడా విజిల్‌ బ్లోయర్స్ ద్వారా బయటకు రావడం గమనార్హం. నకిలీ అప్లికేషన్లను సమర్పిస్తూ, విదేశీ కార్మికులను తక్కువ జీతాలతో దోపిడీ చేస్తున్న నెట్‌ వర్క్‌ లను ఛేదించడానికి ప్రత్యేక ఫ్రాడ్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తోంది.

Also Read: గంభీర్ ఫైర్: ఇది సంక్షోభం కాదు.. కేవలం ‘రీసెట్’ మాత్రమే..!

ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠినమైన నిర్ణయాలు భవిష్యత్తులో హెచ్-1బీ వీసా ప్రాసెస్‌ను మరింత క్లిష్టతరం చేసేలా కనిపిస్తున్నాయి. అయితే, నిజమైన నైపుణ్యం ఉండి, అన్ని అర్హతలతో చట్టబద్ధంగా యూయూస్ వెళ్లాలనుకునే భారతీయ నిపుణులకు దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ, కన్సల్టెన్సీల ద్వారా ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి, లూప్‌ హోల్స్ ఉపయోగించి అమెరికాలో ఉద్యోగాలు సంపాదించాలనుకునే వారికి మాత్రం ఇకపై కఠినమైన రోజులు ఎదురుకానున్నాయి.

leave a reply