సంగారెడ్డి, నవంబర్ 1: తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోవల్సిన పసికందు చెత్తకుప్పపాలు (garbage) చేశారు. కళ్లు కూడా తెరవని ఆ పసికందును కుక్కలు (Stay Dogs) పీక్కు తింటున్న హృదయవిదారక దృశ్యం చూపరుల మనసు కలచివేసింది. సభ్యసమాజం తలదించుకునేలా.. మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఉన్న ఈ ఘటన తెలంగాణ (Telangana)లోని సంగారెడ్డి జిల్లా (Sangareddy district)లో బుధవారం (నవంబర్ 1) వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే..
సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఐడీఏ బొల్లారం (IDA Bollaram)లో రెండు రోజుల క్రితం పుట్టిన ఆడ శిశువును (newborn baby) ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సంచిలో తీసుకొచ్చి పడేసివెళ్లిపోయారు. నవజాత శిశువు చనిపోయిన తర్వాత తీసుకొచ్చారో.. లేదా బతికుండగానే చెత్తకుప్పలో విసిరేశారో అనే విషయం స్పష్టంగా తెలియరాలేదు. చెత్తకుండీ వద్ద ఉన్న కుక్కలు పసికందు ఉన్న సంచిని పీక్కుతింటూ (Dogs Eat Newborn Baby) ఇళ్ల మధ్యలో తీసుకొని వచ్చాయి. దీంతో ఈ ఘటన కాస్తా వెలుగులోకి వచ్చింది. సంచిలోని శిశువు లేత మృతదేహాన్ని వీధి కుక్కలు (Stay Dogs) ముక్కలు ముక్కలుగా కొరికి, పీక్కుతిన్నాయి. కుక్కల దాడిలో చనిపోయిన శిశువు తల భాగం, మొండెం రెండూ వేర్వేరయ్యాయి.
ఇళ్ల మధ్యలోకి కుక్కలు తీసుకొచ్చిన పసికందు మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు (Police) సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు శరీరభాగాలను సేకరించి మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. అయితే శిశువు మృతదేహం లభ్యమైన ప్రదేశంలో సీసీ కెమెరాలు (CC Camera) లేకపోవడంతో శిశువుని ఎవరు తీసుకొచ్చారనే విషయం తెలియరాలేదు. దీంతో దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు రోజుల క్రితం పుట్టినటువంటి శిశువుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

చనిపోయిన శిశువును తీసుకొచ్చి చెత్తకుప్ప (Newborn baby dumped in Sangareddy)లో పడవేశారా..? లేక మరేదైన కారణం ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పసికందును కుక్కలు ఇష్టానుసారంగా పీక్కు తినడంతో శిశువును గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ముక్కు పచ్చలారని ఆ పసికందును పుట్టిన గంటల వ్యవధిలోనే చెత్తకుప్పలో పడవేయడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

Comments are closed.