తాజా వార్తలు

రేయ్…ఎవర్రా నువ్వు…యా ఊర్రా నీది… ఈడ ఏం చేస్సాండవు రా నువ్వు…

రేయ్ ... పోరా నువ్వు ఈడ్నుంచి...

Share this :

రేయ్…ఎవర్రా నువ్వు…యా ఊర్రా నీది… ఈడ ఏం చేస్సాండవు రా నువ్వు…
రేయ్ … పోరా నువ్వు ఈడ్నుంచి…

ఏంది బెదిరిస్సాండవే… నేనెందుకు పోతా…ఈ తావు నాది గానీ… నేనెందుకు పోతా… నా తావు కాడ ఉంటే నన్నెందుకు తిడతాండవ్ రా… నాది రాచీడు… నీది యావుర్రా

రేయ్… నాది ఈ పక్కనే ఉండ్లా యాదవుల పల్లె…
ఈడ తావులు ఇచ్చేది మేం రా… నీకెవడు ఇచ్చినాడు రా తావు ఈడ…

మా నాయనకు ఎప్పుడో పన్నెండెండ్ల కితం గవన్మెంటోళ్లు ఈ ఇందిరమ్మ కాల్నీలో పట్టా ఇచ్చిన్యారు…
ఇప్పుడు నాకు తావు లేదు పో అనేదానికి నువ్వెవర్రా…

రేయ్ … నీకు ఈడ తావు లేదు పోరా… ఎవునికి చెప్కుంటావో చెప్కో పో…కొట్రా ఈన్ని… ఏం సేస్సాడో సూద్దాం…

రేయ్… నన్నే కొడతార్రా… ఈడ తావులు ఎవుని కిట్టం ఒచ్చినట్టు వోడు అమ్ముకుంటార్రా… మీ కథ చెప్తా ఉండ్రా...

సరే పో… కాల్నీ బైటి దాన్క దొబ్బేయండ్రా ఈన్ని…

ఈడ కలకటేరు ఆపీసు ఆనుకుని ఉన్నే ఇందిరమ్మ కాల్నీలో ఇంత అన్నాయం చేస్సాండర్రా మీరు…

రేయ్… ఈడ్నే ఉండ్రా… ఇంటి కాడికి పోయొచ్చా… నీ కథ చెప్తా…

ఓ… న్నా… ఏందిన్నా ఈడ… నా తావు ఉన్యా నన్ను తరిమెస్సాండర్రు…

సూడు బ్బీ… మేం ఇండ్లు కట్టుకున్యాం చానెండ్లు అయింది… నాలుగైదేండ్ల నించి ఈడ తావులు ఇట్టం వొచ్చింటట్టు అమ్ముతాండ్రు…

మన తావులు ఎట్ట అమ్ముతారు న్నా ఈళ్లు… ఎవర్నా…

యాదవుల పల్లె సాంజినేయులు, ఒళ్ళ కొడుకు, ఇంగా యంకర్ రెడ్డి, అడ్డేరుపల్లె సయ్యవారు రెడ్డి, మసాలపేట సూనే. కీకాంత్ ఈళ్లు ప్పా… మొత్తం అమ్మెస్సాండరు…

ఏం… రా నువ్ పోకుండా ఏం సేస్సాండవురా… బెయ్ రా ఈనికి…

ఈడ ఎవుడూ నీకు భయపడే ఓడు లేడు… నేను ఇప్డే కలకటేరు, తాసీల్డార్ కు చెప్తా… అమ్మెళ్యే కు పోన్ సేస్సా ఉండు ఇప్డు నీ కథ చెప్తా…

రేయ్ తిక్క నా కొడకా… ఈడ మేమంతా కలిసి తావుల యాపరమ్ సేసేది అమ్మెల్యే కు తెలుసు…

తాసీల్దార్, ఈ.ఆర్.ఓ, ఈ.ఆర్.ఏ లకు తెల్సు… ఎవుని లెక్క ఓల్లకు ఇచ్చాండం…

అద్దొ… దాడ కనిపిస్సాండ్లా కింద పైన మిద్దె పాత ఈ.ఆర్.ఓ ది, పక్కన కనిపిస్సాండ్లా అది ఈ.ఆర్.ఎ ది… ఏం చేచ్చావు రా…

ఉండు అమ్మెల్యే కు పోన్ చేచ్చా… రింగ్ అయితాంది ఉందుడు…

అమ్మేల్యే సార్… నమస్సారం సార్… ఇందిరమ్మ కాల్నీలో మీ పేరు సెప్పి తావులు అమ్ముతాండరు సార్…

నాకు పట్టా ఉన్య కొడతాండరు సార్… నువ్వైనా సెప్పి నాయం సెయ్ సార్…

ఎవ్రూ మ్మా … ఒరో సాంజీనేయులు కొడుకంట సార్… తిడత, సంపుతా అంటాండడు…

అట్నా… ఎప్పునుంచి సేస్సాండరంట… ఐదేండ్లు ఐతాందట సార్…

నేనే కాదు సార్… ఓ నూరు మంది ఇప్పటికే మీకు చెప్నారంట సార్…

ఓరో నాయక్ అంట సారు… ఈడ్నే ఉండాడు… ఆ యబ్బీ గూడా నీకు సెప్పునా అంటాండడు సారు…

నేను అమ్మెల్యే సారు కు దండం పెట్టి సెప్పునా న్నా… వొందల తావులు ఇట్టానుసారం అమ్ముతాండరు సారు అని సెప్పిన… అట్నా … ఓల్ల కథ నేను సెప్తానని అన్యాడు… ఏం సెప్పలా… వొళ్ళు అమ్ము కుంటానే ఉండారు...

ఇట్టా గెడ్డి తింటా ఉండే ఆపీసార్లు, ఒళ్లోల్ల కోసం బీదోల్ల కడుపులు కొడతా ఉన్యా కండ్లకు గుడ్డ కట్టుకుని పాపం మూట గట్టుకుంటాండే అమ్మెల్యే ఉండే దాంక బీదోల్లకు తావులే కాదు ఒంటి మీద గుడ్డలు గూడ మింగేస్సారు…

లేని బీద నా కొడుకులం సార్… ఇంటి తావులు గూడ పెరుక్కొంటే ఎట్ట బతుక్కొ వల్ల సార్…

నలుగురైదు మందికి ఇదే పని సారు ఈ కాల్నీలో… లచ్చలు ఇస్సాండం లే మా జోలికి ఎందుకు వస్సారు అంటాండరు సారు…

సిన్న బిడ్లు, ఆడ బిడ్లు ఉండే వొల్లం సారు… యాడికి పోవాలా… మా కడుపులు, మా బిడ్డల కడుపులు కొడితే మీ బతుకులు ఏమైపోతాయో సూసుకోండి…

ఈడ పట్టాకు 70ఏలు, పొజిషన్ సర్టికేటు కు 40ఏలు, గునాదికి ఏరే లెక్క… 3సెంట్లకు రోడ్డు దగ్గర ఐతే 15 లచ్చల కాడికి, రోంత లోపలైతే 10 నుంచి 12 లచ్చల కాడికి ఇయ్యాల సార్…

ఇప్పుటికే తావులు లేవు సార్… ఒళ్ల అమ్మనాయన్లు సంపాయిచ్చిన సొంత తావుల మాదిరి అమ్మేసినారు…

ఈడ ఇంగ తావులు ఇచ్చేదానికి ఏం లేవ్ సార్…

అమ్మెల్యే సారు… ఇందిరమ్మ కాల్నీలో తావులు అమ్మే ఓల్లను పా…….త దాంతో కొట్టి బీదోల్లకు నాయం సేయ్ సారు… మీకు నట్టపోయిన అందరం దండం పెడతాం…

ఇప్పుడు గూడా నువ్వు పోయి ఒకసారి సూడు సారు… ఎంత ఆన్నాయం సేస్సాండరో…

పభుత్వ భూములు అమ్ముకుండే దానికి ఈల్లు ఓరు సారు….

ఇప్పుడు గూడా 20 గునాదులు ఉండాయి సారు… ఒక్క సారి ఓపిక సేసుకుని ఆడికి పొయ్యి సూడు సారు… అన్నాయం కళ్ళ ముందుకు వస్సుంది…

మొన్న బిజిలి గుట్లో గునాదులను పగలగొట్నెట్టు ఈడ అక్కమంగా యేసిన గునాదులను పగల గొట్టిచ్చేయ్ సారు…

రాచీటోళ్లు… బీదొల్లు నిన్ను నమ్ముతారు సారు…

దిక్కు లేని మాలాంటోల్లను మా తావుల కాడికి రానీకుండా సేస్సాండరు కదా… మీరు సేసే అన్నాయాలు దేవుడు సూస్సాండడు ర్రా…

అన్నాయం శేసే మీకు, మీ బిడ్లకు, మీ యనకాల ఉండే ఒల్ల బిడ్లకు దేవుడు ఏం సెస్సాడో సూస్కొండిర్రా…

బీదోళ్ళ కడుపులు కొట్టిన మీ అందరినీ నూనెలో కాలుస్సాడుర్రా దేవుడు…

సరే న్నా… పోయొస్సా… అన్నిటికీ దేవుడే ఉండాడు… పోతా పోతా గుండు ఆంజినేయ సామి కాడికి పోయి ఈళ్ల అన్నాయం కథ సెప్పిపోతా న్నా

– సముద్రవాణి