ఒక్క మనిషి మీద ఇంత ద్వేషమా..? ఇంత పగా..? ఇంత అసూయా..? ఇప్పుడు ఇదే మాట బాగా వినిపిస్తోంది. తమ రాజకీయ ఎదుగుదలకి అడ్డు వస్తున్నాడని ఒక్క మనిషి మీద ఇంత మంది కలిసి ఇలా విషం కక్కడం బహుశా దేశ రాజకీయాలలో ఇదే ఏమో. ఇంతకీ ఇప్పుడు ఈ ద్వేషం ఎవరి గురించో కాదు.. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ పైన కొంతమంది పని గట్టుకుని మరీ విష ప్రచారం చేస్తున్నారు. కొందరైతే మరో అడుగు ముందుకు వేసి బెదిరింపులు కూడా చేస్తున్నారు. నిజానికి 2009లో యువ రాజ్యం పేరుతో రాజకీయ ప్రయాణం ప్రారంభించినప్పటికీ.. 2014 ఎన్నికలకు ముందు జనసేన పేరుతో పూర్తిస్థాయి రాజకీయ పార్టీ ప్రారంభించారు పవన్. నాటి నుంచి ఆయనను అటు సామాజిక పరంగా, ఇటు రాజకీయంగా అడ్డుకునేందుకు కొందరు పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారు.
ముందుగా కులం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కాపు కులానికి చెందిన పవన్ కల్యాణ్.. ఏ రోజు తాను కాపు అని ప్రకటించలేదు. ఆయన అన్ని కులాల వారిని సమానంగానే చూసారు. అన్ని మతాల వారిని గౌరవించారు. అన్ని ప్రాంతాల వారిని దగ్గరకు తీసుకున్నారు. అయితే కొందరు మాత్రం.. పవన్‌ను కులం చట్రంలో ఇరికించేందుకు నానా పాట్లు పడుతున్నారు. వీరిలో ముఖ్యంగా ముగ్గురి తీరు తీవ్ర విమర్శలకు తెర లేపుతోంది. దాసరి రాము, అడ్వకేట్ రజని, నరేంద్ర.. ఈ ముగ్గురు ప్రతిరోజూ ఏదో ఒక న్యూస్ ఛానల్‌లో వ్యూస్ కోసం కనిపిస్తారు. ఈ ముగ్గురు చెప్పే ఒకే ఒక్క మాట.. “మా కులాన్ని పవన్ మోసం చేశాడు. ఏదో చేస్తాడని నమ్మి గెలిపించుకున్నాం. కానీ ఏమీ చేయలేదు. మోసం చేస్తున్నాడు.” అంటూ ఒకటే స్క్రిప్ట్ మార్చి మార్చి.. ఒక్కొక్కరు ఒక్కో చానెల్, ఒక్కో డిబేట్, ఒక్కో రోజు.. వీళ్లకు ఒకటే పని. అసత్యాలని ప్రజల మీదకి రుద్దటం.
అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలకు ఈ ముగ్గురే కాదు.. పవన్‌ను విమర్శిస్తున్న ఏ ఒక్కరూ జవాబు చెప్పలేక పోతున్నారు. పవన్ నిర్వహిస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో వేయిస్తున్న రోడ్డు మీద ఒక్క కులమే నడుస్తున్నదా?.. పవన్ తీసుకొచ్చిన పర్యావరణ సంస్కరణలు వలన ఒక్క కులమే లాభపడుతుందా?.. అటవీ శాఖలో పవన్ తీసుకొచ్చిన పెను మార్పు వలన ఒక్క కులానికే ఉపయోగమా?.. పంచాయితీ రాజ్ శాఖలో తాను తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పు ఒక్క కులానికే ఉపయోగమా?.. అనే ప్రశ్నలకు మాత్రం జవాబులు చెప్పటం లేదు. ఇవన్నీ పక్కన పడేసి.. ఒక పార్టీకి సపోర్టు చేస్తున్నాడు.. దమ్ముంటే ఒక్కడే రావాలి.. సింహం సింగిల్.. ప్యాకేజ్.. అంటూ ఒకటే నస పెడుతున్నారు. ప్రజల్లో కులాల కుంపట్లు రగిల్చేందుకు ప్రతి రోజు నానా పాట్లు పడుతున్నారు. అసలు కులాల మధ్య చిచ్చు పెట్టడమే రాజకీయమా..?
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ కట్టుకథ అల్లాడు.. తర్వాత నోరు జారిన విషయంపై వెనక్కి తగ్గాడు. కేసులు పెట్టడంతో క్షమించాలని కోరాడు. ఆ కథ అక్కడితో అయిపోయింది. నాగేశ్వర్ పై జనసైనికులు విమర్శలు చేస్తే.. దానిని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్‌ను ఒక ప్రాంతానికే పరిమితం చేస్తూ.. ఆయనపై విద్వేషం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే.. తామేదో నిజమైన తెలంగాణా వాదులన్నట్లుగా.. తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసినట్లుగా.. రక్తాలు చిందించినట్లుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ.. పవన్‌ను హైదరాబాద్‌లో తిరగనివ్వము, పవన్ తెలంగాణా ద్రోహి అని మొదలెట్టారు. నిజానికి పవన్ తెలంగాణ ప్రజలకు ఎంతో సాయం చేశారు. కొండగట్టు దేవాలయం అభివృద్ధికి పవన్ చూపించిన చొరవ అందరికీ తెలిసిందే. కాని అసలు సంబంధం లేకుండా పవన్ ఫొటోను చెప్పుతో కొట్టించారు.. అది కూడా అనామకులతో. ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఏమైనా ఉంటుందా?
ఇక ప్రకాష్ రాజ్, ప్రశ్న జోసఫ్.. ఒకరికి ఒకరు సంబంధం లేకపోయినా సరే.. మతాన్ని అంటగట్టి పవన్ మీద విషం చిమ్ముతున్నారు. 10 సార్లు మీడియా ముందుకు వస్తే అందులో 8 సార్లు పవన్ గురించి, పవన్ మీద విద్వేషం మాత్రమే ఉంటుంది. నిజానికి ఇప్పటి వరకు పవన్ వేరే ఏ కులాన్ని కించపరచలేదు. ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. అదే సమయంలో తన మతాన్ని చిన్న చూపు చూడకండి అన్నాడు. అది కూడా తప్పు అంటున్నారు కొందరు సో కాల్డ్ సోషలిస్టులు. అవకాశం దొరికినా.. దొరకకున్నా సరే.. అవకాశం కలిపించుకొని మరీ పవన్ మీద విషం చిమ్ముతానే ఉంటారు. వీటిని అసలు రాజకీయం అంటారా? ఒక్కడిని ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇలా నీచానికి దిగజారాలా? రాజకీయాలలో కొన్ని కుటుంబాలు మాత్రమే ఉండాలా? అదేదో వారి జన్మ హక్కులా ఫీల్ అయిపోయి.. ఇతరులు ఎవరు వచ్చినా వారిని నాశనం చేసే దాకా నిద్రపోరా..?
సొంత డబ్బులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన చిరంజీవి రాజకీయ సన్యాసం తీసుకునే దాకా విషం చిమ్ముతానే ఉన్నారు. రక్తం అమ్ముకున్నాడు, టికెట్స్ అమ్ముకున్నాడు అని గోల గోల చేశారు. అలా ఆరోపించే వాళ్ళు ఇప్పుడు వచ్చి అవును ఎవరో అనమంటే అన్నామని బహిరంగంగానే ఒప్పుకున్నారు. కులం , మతం, ప్రాంతం ముసుగులో ప్రతీ రోజు నష్టపోతుంది ప్రజలే.
గెలుపు ఓటమి కంటే ఇలాంటి నీచ రాజకీయాలని తట్టుకొని నిలబడితే చాలు.. గెలుపు దానంతట అదే వస్తుంది. కొంచెం లేట్ అవుతుందేమో కాని తప్పకుండా ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. ప్రతీ సంవత్సరం ఈ కుల మత పిచ్చి ఉన్న ముసుగు ముసలి ఓటర్ల సంఖ్య తగ్గుతుంది. కొత్త రక్తం వస్తుంది. వారికి ఓటు హక్కు వస్తుంది. వారందరూ రాజకీయాలు అర్థం చేసుకుంటున్నారు. వాళ్లే అసలైన నాయకుడిని ఎన్నుకుంటారు. ఈ కుల కుంపట్లు పెట్టే వారిని తన్ని తరిమేస్తారు.
