NBK 112: బాలయ్య-కొరటాల మూవీ క్రేజీ అప్‌డేట్..!

20 రోజుల పాటు క్రేజీ షెడ్యూల్

Share this :

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో ‘గాడ్ ఆఫ్ మాసెస్’ బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబో ఒకటి. ఇటీవలే ఏపీ రాజధాని అమరావతి వేదికగా పూజా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రం (‘NBK 112’) ప్రస్తుతం శరవేగంగా సన్నాహాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఒక సంచలన షెడ్యూల్ అప్‌డేట్ తాజాగా బయటకు వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Also Read: కొరియా పర్యటనలో మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్..!

ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన మరియు భారీ యాక్షన్ షెడ్యూల్‌ను రాబోయే ఆగస్టు రెండో వారం నుంచి ప్రారంభించేందుకు చిత్రబృందం పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. ఈ షెడ్యూల్ మొత్తం కేవలం హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ కోసమే కేటాయించినట్లు సమాచారం. బాలయ్య సిగ్నేచర్ స్టైల్, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా ఉండే ఈ భారీ ఫైట్ సీక్వెన్స్ కోసం చిత్రయూనిట్ ఏకంగా 20 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరపనుంది.

డైరెక్టర్ కొరటాల శివ సినిమాల్లో కేవలం హీరో ఎలివేషన్లే కాకుండా, కథలో అంతర్లీనంగా సమాజానికి మేల్కొలిపే ఒక బలమైన సామాజిక సందేశం ఉంటుంది. ఈ సినిమాలో కూడా అలాంటి స్ట్రాంగ్ సోషల్ కాన్సెప్ట్‌తో పాటు బాలయ్యను మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్‌లో చూపించబోతున్నారు. దీనికంతటికీ మించి ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కథను మలుపు తిప్పే విధంగా ఉండబోతోందట. ఈ ఫ్లాష్‌బ్యాక్ అంతా ‘మాఫియా’ బ్యాక్‌డ్రాప్‌లో మోస్ట్ పవర్‌ఫుల్‌గా సాగుతుందని సినీ వర్గాల్లో ఒక టాక్ గట్టిగా వినబడుతోంది.

Aslo Read: సియా గోయల్.. గూగుల్ సెర్చ్ హిస్టరీ చూసి పోలీసుల షాక్..!

ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ నటించనున్నారనే వార్త ఇప్పటికే ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మాస్ ప్రేక్షకులను ఊర్రూతలూగించే బాలయ్య మాస్ ఇమేజ్, కొరటాల శివ క్లాస్ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ స్క్రీన్ ప్లే తోడైతే థియేటర్లలో ప్రేక్షకులకు అసలైన విందు భోజనం లభించడం ఖాయం. ట్రేడ్ వర్గాల్లో సైతం భారీ అంచనాలు రేకెత్తిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.