కొరియాలో లోకేష్ సూపర్ స్పీడ్..!

వ్యాపారవేత్తలకు లోకేష్ అదిరిపోయే ఆఫర్స్

Share this :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహాన్ని తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియా పర్యటన శరవేగంగా సాగుతోంది. ఐదో రోజు పర్యటనలో భాగంగా ఆయన కియా మోటార్స్ (Kia Motors) ఉన్నతస్థాయి బృందంతో కీలక సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లాలో ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న కియా ప్లాంట్‌ను మరింత విస్తరించాలని, ఏపీలో ఇంటిగ్రేటెడ్ ఈవీ (EV) మరియు హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని ఆయన కోరారు. పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ సర్వసన్నద్ధంగా ఉందంటూ కియా ప్రతినిధులకు మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు.

Also Read: ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోయిన ట్రంప్..!

ఈ భేటీలో కియా యాజమాన్యం ముందు మంత్రి లోకేశ్ పలు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు ఉంచారు. విశాఖపట్నం పోర్టు సమీపంలో సీకేడీ (CKD) అసెంబ్లింగ్ మరియు ఎక్స్‌పోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు ఏపీలో ఈవీ-కాంపోనెంట్ల తయారీ కేంద్రాన్ని స్థాపించాలని, సరికొత్త సాంకేతికతతో కూడిన ఈవీ పవర్‌ట్రెయిన్ టెస్టింగ్ కేంద్రాన్ని (EV Powertrain Testing Centre) అభివృద్ధి చేయాలని కోరారు. మంత్రి లోకేశ్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కియా ప్రతినిధులు.. తమ ఉన్నతస్థాయి బోర్డు బృందంతో చర్చించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో భాగంగా సియోల్ నగరంలో దక్షిణ కొరియా రాజకీయ వ్యవహారాలు, విదేశాంగ శాఖ ఉపమంత్రి యుయ్-హే సిసిలియా చుంగ్‌తో మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న 3S (Speed, Stability, Service – స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్) విధానం కొరియా పెట్టుబడిదారులకు ఒక బలమైన రక్షణ కవచంలా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఏపీని కొరియన్ కంపెనీలకు అత్యంత స్థిరమైన, నమ్మకమైన వ్యాపార కేంద్రంగా మార్చేలా అక్కడి పరిశ్రమదారులను ప్రోత్సహించాలని కొరియా ఉపమంత్రిని కోరారు.

Also Read: గంభీర్ ఫైర్: ఇది సంక్షోభం కాదు.. కేవలం ‘రీసెట్’ మాత్రమే..!

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు పెట్టే వారికి ప్రభుత్వం అందించే పన్ను రాయితీలు, తక్కువ ధరకే భూమి కేటాయింపులు, ప్రత్యేక సబ్సిడీలు ఎంతగానో మద్దతుగా నిలుస్తాయని మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా కొరియా విదేశాంగ శాఖకు వివరించారు. ఏపీలో సంస్కృతీ సంప్రదాయాల మార్పిడి కోసం ఒక ప్రత్యేక ‘కొరియన్ కల్చరల్ సెంటర్’ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా, కొరియా సాంకేతిక నైపుణ్యాలను ఏపీ యువతకు అందించేందుకు వీలుగా దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త శిక్షణా అకాడమీలను స్థాపించడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.

leave a reply