నాని పైన అంత కనికరం ఎందుకో..?

మళ్లీ రెచ్చిపోతున్న వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానిపైన ఎందుకు అంత కనికరం..?

Share this :

మళ్లీ రెచ్చిపోతున్న వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానిపైన ఎందుకు అంత కనికరం..? పిల్లి గుడ్డిది అయితే.. ఎలుక ఏదో ఎత్తి చూపిందట.. చంద్రబాబు రాజకీయ, అధికారం అనుభవానికి కూడా.. కనీస మర్యాద ఇవ్వకుండా, బూతులతో రెచ్చిపోయిన వారిని.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమి చేయలేని పరిస్థితి ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల ప్రభుత్వం అని కనిపించటం లేదు. టీడీపీ, వైసీపీ కూటమి ప్రభుత్వం మాదిరిగా ఉందనే విమర్శలు వస్తున్నా కూడా.. చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.

Also Read: లక్ష్మణ్ కే కోచింగ్ బాధ్యతలు..?

అధికారం అండతో అటు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పైన ఎన్నెన్నో విధాలుగా రెచ్చిపోయారు వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నప్పటికీ.. రాయలేని భాషలో రెచ్చిపోయాడు కొడాలి నాని. అందుకే ఆయనకు బూతుల మంత్రి అనే మరో పేరు కూడా తగిలించారు. అయితే ప్రస్తుతం కొడాలి నానిని ఏ కారణాలతో వదిలేశారో అర్థం కావటం లేదు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయినా కూడా కొడాలి నాని పై దృష్టి సారించకపోవటంతో ఇప్పుడు మళ్లీ ఆయన రెచ్చిపోతున్నారు. మంత్రి పదవితో రెచ్చిపోయిన కొడాలి నాని.. పదవి కోల్పోయిన తర్వాత కూడా బూతులు వాడటంలో ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. పైగా నేనేం తప్పు మాట్లాడలేదే.. అంటూ సమర్థించుకున్నాడు కూడా.

నన్నేం చేయలేరు.. నా బొచ్చు కూడా పీకలేరు.. ఒరేయ్.. పప్పు.. నీ అయ్య.. అంటూ రెచ్చిపోయాడు కొడాలి నాని. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, పిఠాపురంలో పవన్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని శపథాలు కూడా చేశారు. దమ్ముంటే గుడివాడలో నా మీద పోటీ చేసి గెలవాలంటూ బాలకృష్ణకు సవాల్ కూడా విసిరారు. ఎన్నెన్నో మాటలు.. మరెన్నో బూతులు తిట్టారు. అప్పట్లో నారా భువనేశ్వరి పైన కూడా అసభ్యకరమైన విమర్శలు చేసిన, తనకు సన్నిహితుడైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కనీసం మందలించలేదు. వంశీ చేసిన వ్యాఖ్యలను తప్పు కూడా పట్టలేదు.

Also Read: ఎమ్మెల్యే వర్సెస్ కార్యకర్త.. జనసేనలో వింత వాతావరణం..!

ఐదేళ్ల పాటు బండ బూతులు తిట్టిన వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానిని చంద్రబాబు, లోకేష్ క్షమించి వదిలేసినా.. టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ అభిమానులు, సానుభూతి పరులు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు.. ఆయన చేసిన కామెంట్లను ఇప్పటికీ మరిచిపోలేక పోతున్నారు. అలాంటి వ్యక్తిని రెండేళ్ల పాటు ఈ తండ్రీ కొడుకులు పట్టించుకోలేదంటే..! అసలేం జరుగుతుందో..? కొడాలి నాని పట్ల అంత కనికరం ఎందుకు చూపుతున్నారో..? ఎక్కడో ఏదో జరిగి ఉంటుందా..? నిన్నటి వరకు మౌనంగా ఉన్న కొడాలి నాని మళ్లీ ఇప్పుడు రెచ్చిపోతున్నాడంటే.. అసలు కారణం ఏమిటో.. ఆ పై వాడికే తెలియాలి.

leave a reply