నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు తీరు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. బాలయ్య చిన్నల్లుడు, మంత్రి లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ ఓ మీడియా సంస్థను బెదిరించారంట. విశాఖలో ఓ వార్త పత్రికలో చిన్న రిపోర్టర్‌గా జీవితం ప్రారంభించిన వ్యక్తి.. ఆ తర్వాత లీడర్ అనే పేరుతో ఓ చిన్న పత్రిక ప్రారంభించారు. రాజకీయ నేతల అండతో ఇప్పుడు వందల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారనేది బహిరంగ రహస్యం. అయితే ఆ లీడర్ పత్రిక తొలి నుంచి టీడీపీ, జనసేన పార్టీలకు వ్యతిరేకమనేది రెండు పార్టీల నేతలకే కాదు.. విశాఖ వాసులందరికీ తెలుసు. టీడీపీకి వ్యతిరేకమని.. వైసీపీకి అనుకూలమని విశాఖలో మీడియాలో లీడర్ పత్రికకు పేరు.
ఇటీవల విశాఖ టీడీపీ ఎంపీ భరత్‌ను టార్గెట్‌గా చేసుకుని.. పదే పదే వార్తలు రాస్తున్నారు. భరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీ వందల కోట్లు విలువు గల ప్రభుత్వం భూములు, ఆక్రమించిందన్న ఆరోపణలతో లీడర్ పత్రిక అనేక కథనాలు ప్రచురించింది. దీంతో ఆగ్రహం చెందిన ఎంపీ భరత్.. గీతం యూనివర్సిటీ పై ప్రచురించిన అసత్య కథనాలకు క్షమాపణ చెప్పకుంటే.. లీడర్ పత్రిక పై 20 కోట్ల రూపాయల నష్ట పరిహారం కేసు వేస్తామని నోటీసు ఇచ్చారు. ఈ విషయాన్ని లీడర్ పత్రికకు గీతం వర్సిటీ లీగల్ నోటీసు ఇచ్చింది.
ఎంపీ భరత్ తమ మీడియా సంస్థ పై రూ.20 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని నోటీసు ఇచ్చారని “లీడర్” పత్రిక ఒక కథనం ప్రచురించింది. అయితే లీడర్ పత్రిక ప్రచురించిన కథనంపై ఎంపీ భరత్‌కు చెందిన గీతం వర్సిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భూ ఆక్రమణల కథనాల్లో నిజం లేదని.. అవాస్తవాలు ప్రచురించి గీతం యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించిందని, తప్పుడు కథనాలు ప్రచురించినందుకు కనీసం క్షమాపణ కూడా చెప్పకపోవటంతో.. ఆ సంస్థ పై పరువు నష్టం కేసు వేస్తామని నోటీసు ఇచ్చారు. దీనితో లీడర్ పత్రిక మరింత రెచ్చిపోయింది. మీడియాను టీడీపీ ఎంపీ భరత్ బెదిరిస్తున్నారంటూ మరో కథనం ప్రచురించింది.
లీడర్ పత్రిక టీడీపీకి వ్యతిరేకం. వైసీపీకి అనుకూలం. ఈ విషయం ఆ పత్రిక ప్రచురించిన కథనాలను చదివితే అసలు విషయం బయట పడుతుంది. వందల కోట్ల విలువైన ప్రభుత్వం భూములను ఎంపీ భరత్‌కు చెందిన “గీతం” వర్సిటీ నిజంగానే ఆక్రమించిందా..?, ప్రభుత్వం భూములను ఆక్రమించలేదని ఎంపీ భరత్ స్వయంగా చెబుతున్నారు. కానీ వందల కోట్లు విలువైన ప్రభుత్వం భూములు గీతం వర్సిటీ పరిధిలో ఉన్నాయని లీడర్ పత్రిక పదే పదే కథనాలు ప్రచురిస్తోంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఈ విషయంపై వైసీపీ నాయకులు కూడా ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. కాని లీడర్ పత్రిక మాత్రం పదే పదే కథనాలు ప్రచురిస్తోంది. అంతే కాకుండా.. మాపై పరువు నష్టం కేసు వేస్తా అంటూ ఎంపీ భరత్ నోటీసు ఇచ్చారని.. ఆ నోటీసును తక్షణమే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తుంది. మరి భరత్ సారధ్యంలోని గీతం వర్సిటీ.. ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి