పుష్ప 3.. 2030 తర్వాతే..!

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా?

Share this :

‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం ఆల్ ఇండియా లెవెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. తన మార్కెట్‌ను అంతర్జాతీయ స్థాయికి విస్తరించాలనే ప్లాన్‌తో ఆయన వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. అయితే, బన్నీ నటిస్తున్న రాబోయే చిత్రాల లైనప్‌ను గమనిస్తే.. ఆయన అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పుష్ప 3’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా కాలం పట్టేలా ఉందని సినీ వర్గాల్లో గట్టిగా టాక్ నడుస్తోంది.

Also Read: ప్లాట్‌ఫామ్ టికెట్ కంటే, ట్రైన్ టికెట్ చౌక..!

అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ‘రాకా'(RAKA) అనే భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్, ఆ వెంటనే మలయాళ విలక్షణ దర్శకుడు బాసిల్ జోసెఫ్‌తో మరో సినిమా చేయడానికి ఆయన అంగీకరించారు. కేరళలో బన్నీకి ఉన్న భారీ ఫాలోయింగ్ కారణంగా ఈ మలయాళ కాంబినేషన్‌పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్రాలన్నీ పూర్తి కావడానికి కనీసం మరో మూడు నుండి నాలుగేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.

అల్లు అర్జున్‌ను ఐకాన్ స్టార్‌గా నిలబెట్టడంలో మన తెలుగు దర్శకుల పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా సుకుమార్ తెరకెక్కించిన  ‘పుష్ప’ సిరీస్ ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ప్రారంభం కావాల్సిన ‘పుష్ప 3’.. బన్నీ పరభాషా దర్శకులకు ఇచ్చిన కమిట్‌మెంట్స్ వల్ల తీవ్రంగా ఆలస్యం కానుంది. ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తే, 2030 తర్వాత మాత్రమే సుకుమార్-బన్నీ కాంబోలో ‘పుష్ప 3’ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. అంతకాలం పుష్పరాజ్ కోసం ఫ్యాన్స్ ఓపికగా వేచి ఉండగలరా అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారింది.

Also Read: తమిళనాడు పాలిటిక్స్‌లో ప్రకంపనలు..!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’ చిత్రం 2027 డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో బన్నీ సరికొత్తగా నాలుగు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) వర్క్ భారీగా ఉండనుందని సమాచారం. ఒకవేళ గ్రాఫిక్స్ పనుల వల్ల ఈ సినిమా ఆలస్యమైతే 2028 లోనే థియేటర్లలోకి వస్తుంది. ఆ తర్వాతే లోకేష్, బాసిల్ జోసెఫ్ ల సినిమాలు వరుసగా విడుదలవుతాయి. ఈ లెక్కన బన్నీ మళ్లీ తెలుగు దర్శకులతో ఎప్పుడు సినిమా చేస్తారో, ముందుగా ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి.

leave a reply