శ్రీ కృష్ణాష్టమి రోజున తిరుమల అధికారినే శ్రీ కృష్ణ జన్మస్థానం పంపటం కరెక్టు కాదేమో..!. తిరుమల శ్రీవారి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథం ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేయటం సరికాదని .. ఆయనకు వారసత్వంగా, భార్య తరఫున కూడా కోట్లు విలువగల ఆస్తులు ఉన్నాయని.. ఆయా ఆస్తుల ద్వారా ఆదాయం లక్షల్లో ఉంటుందని.. కానీ ఆదాయ పన్ను సక్రమంగా కట్టారో..? లేదో?. ఆస్తుల కొనుగోళ్ల వివరాలు నిబంధనల ప్రకారం అధికారులకు తప్పనిసరిగా తెలియ జేయాల్సిందే. కానీ టీటీడీ అధికారులకు లోక నాథం కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు తెలియ చేశారో..? లేదో..? ఇప్పుడు ఆ ఆస్తులపైనే ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
నిజానికి టీటీడీలో ఆయనకు అత్యంత నిజాయితీ పరుడైన అధికారిగా పేరు. ఆ విధమైన గుర్తింపు కూడా వుంది. టీటీడీలో వివిధ హోదాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగుల్లో 95 శాతం పైగా పనిచేసే వారందరూ ముక్త కంఠంతో ఈ విషయాన్ని చెబుతున్నారు. అయితే లోకనాథంకు వ్యక్తిగతమైన బలహీనతలున్నాయన్న ప్రచారం ఉంది తప్ప.. అవినీతిపరుడు కాధని, ఆయన లంచాలు తీసుకున్నట్లు మా సర్వీసులో మేము వినలేదని సీనియర్ అధికారులు, ఉద్యోగులే బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఏసీబీ సోదాలు జరగటం తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరువు, ప్రతిష్టలు మంటగలిసినట్లుగా భావిస్తున్నారు.
తన కింద పనిచేసే అధికారులలో ఎవరెవరు నిజాయితీ పరులు, ఎవరెవరు అవినీతి పరులు, ఎవరెవరికి ఏయే బలహీనతలున్నాయి.. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎవరెవరు, ఎక్కడెక్కడ, ఎప్పటి నుండి పనిచేస్తున్నారు.. అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేయకపోవటమే ఆయన చేసిన అతి పెద్ద తప్పు. అంతే కాకుండా టీటీడీ ఈవోగా శ్యామలరావు ఉన్నప్పుడు లోకనాథంను బదిలీ చేయటం జరిగింది. కాని ఆయనను అక్కడనుండి పంపకుండా అదే పోస్టులో కొనసాగించటం కూడా వెంకయ్య చేసిన తప్పే. ఆ తప్పే ఈ రోజు ఆయన పరువు, ప్రతిష్ఠలు పోవటానికి ముఖ్య కారణం అయ్యింది.
అసలే వెంకయ్యకు ఇంటా, బయట శత్రువులు ఎక్కువ. అడిగిన వారందరికీ శ్రీవారి సేవా టిక్కెట్లు ఇచ్చుండారు. ఈ విషయంలో బంధువులు, మిత్రులు కూడా వెంకయ్యకు వ్యతిరేకులే అయ్యి ఉండారనేది సన్నిహితుల మాట. వారంతా ఇప్పుడు విమర్శలు, ఆరోపణలు చేసేందుకు వెంకయ్య అవకాశం ఇచ్చినట్లు అయ్యింది. ఇంతకు లోకనాథం పై ఏసీబీకి ఫిర్యాదు చేసిన తెర వెనకున్న ప్రభుద్ధులు ఎవరో.? కొసమెరుపు ఏమిటంటే.. లోకనాథం నిజాయితీ పరుడైనా కూడా పూర్వీకులు ఇచ్చిన ఆస్తులపైన వచ్చిన ఆదాయంతో ఎక్కడెక్కడ ఆస్తులను ఏయే రూపంలో కొనుగోలు చేశారో టీటీడీ అధికారులకు లిఖిత పూర్వకంగా తెలియ చేశారా..? లేదా?. అలాగే వచ్చిన ఆదాయంపైన ఆధాయం పన్ను కట్టారా..? లేదా..?
ఆస్తులు కొనుగోళ్లపై సంబంధిత టీటీడీ అధికారులకు లిఖిత పూర్వకంగా తెలియ చేయకుంటే అధి ముమ్మాటికీ పెద్ద తప్పు చేసినట్లే. ఏది ఏమైనా టీటీడీ సంస్థకు ఎంతో విలువ ఉంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో పనిచేసే వారందరూ నిజాయితీ పరులై ఉండాలి. వ్యక్తిగత బలహీనతలు ఉండకూడదు. దురలవాట్లు అసలే ఉండకూడదు. అలాంటి వారినే శ్రీవారి సన్నిధిలో నియమించాలి. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటివి పాటించకుండా ఇష్టారాజ్యంగా నియామకాలు చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక తిరుమల అదనపు ఈవోగా వెంకయ్య చౌదరిని నియమించారు. అప్పుడైనా కళ్లు తెరిచి ఉంటే.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి జరిగేది కాదు.
లోకనాథంను బదిలీ చేసినప్పుడు ఆయనను అక్కడ నుండి వెంటనే తప్పించి ఉంటే.. ఇలాంటి ఘటన ఎదురయ్యేది కాదు. ఈ విషయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా సరైన రీతిలో పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. చివరకు బలైంది మాత్రం… జరగాల్సిన నష్టం జరిగింధి. మరో విషయం ఏమిటంటే.. టీటీడీ సంస్థలో ఏసీబీ దాడులు జరగటం.. అది కూడా టీటీడీ ఈవోకు కనీస ముందస్తు సమాచారం ఇవ్వకపోవటం.. ఏసీబీ అధికారులు చేసిన క్షమించరాని తప్పే. ఏది ఏమైనా… తిరుమలను కాపాడాల్సింది మాత్రం.. ఆ ఏడుకొండల వాడే.. గోవిందా.. గోవింద.
