ద్రావిడ్‌కు ఇంగ్లండ్ టెస్ట్ కోచ్ ఆఫర్..?

ద్రావిడ్ కు ఈసీబీ గాలం

Share this :

భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ జట్టుకు తదుపరి కోచ్‌గా ద్రావిడ్ బాధ్యతలు చేపట్టబోతున్నారనే ప్రచారం అంతర్జాతీయంగా జోరందుకుంది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం పాలవడంతో.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) ప్రస్తుత కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్‌ను టెస్ట్ బాధ్యతల నుండి తప్పించింది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈసీబీ సిద్ధం చేసిన షార్ట్‌లిస్ట్‌లో రాహుల్ ద్రావిడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Also Read: టీడీపీ దురంధర్ గా మారిపోయిన జగన్..!

ద్రావిడ్‌కు ఉన్న అపారమైన అనుభవం, భారత్‌ను 2024 టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిపిన ట్రాక్ రికార్డే దీనికి ప్రధాన కారణం. మరోవైపు, ఇంగ్లండ్ జట్టుకు ఇది అత్యంత కీలకమైన సమయం. వచ్చే ఏడాది జరగబోయే ప్రతిష్టాత్మక ‘యాషెస్ సిరీస్’ కంటే ముందే తమ టెస్ట్ జట్టును తిరిగి విజయాల బాట పట్టించాలని ఈసీబీ పట్టుదలగా ఉంది. అందుకే కేవలం దూకుడుగా ఆడే ‘బజ్‌బాల్’ విధానంపైనే కాకుండా, సాంప్రదాయ టెస్ట్ క్రికెట్‌లో పటిష్టమైన వ్యూహాలు రచించగల రాహుల్ ద్రావిడ్ లాంటి మేధావి అయితేనే జట్టుకు సరైన దిశా నిర్దేశం చేయగలరని ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ బలంగా నమ్ముతోంది.

Also Read: ఆ మేఘాలు ఎక్కడ..? భయపెడుతోన్న శాటిలైట్ ఫోటోలు..!

అయితే ద్రావిడ్ పూర్తిస్థాయి కోచింగ్‌కు ఆసక్తిగా లేరని తెలుస్తోంది. కానీ ఇంగ్లండ్ ఆఫర్ చేస్తున్నది కేవలం టెస్ట్ జట్టు బాధ్యతలు మాత్రమే కావడంతో, తక్కువ ప్రయాణాలు ఉండే ఈ ఆఫర్‌కు ‘ది వాల్’ గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో చూడాలి. ఒకవేళ ద్రావిడ్ ఒప్పుకోకపోతే ఆండీ ఫ్లవర్, సంగక్కర పేర్లను కూడా ఇంగ్లండ్ పరిశీలిస్తోంది. రాహుల్ ద్రావిడ్‌కు సాంప్రదాయ టెస్ట్ ఫార్మాట్ అంటే అమితమైన ఇష్టం. ఇంగ్లండ్ టెస్ట్ కోచ్ పదవి చేపడితే ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే పని ఉంటుంది కాబట్టి, మిగిలిన సమయం ఇంట్లోనే గడపవచ్చు. ఈ కారణం చేతనే ద్రావిడ్ ఈ ఆఫర్ వైపు మొగ్గు చూపవచ్చని బ్రిటీష్ మీడియా భావిస్తోంది.

leave a reply