ఇంచార్జ్ మంత్రులకు చంద్రబాబు చురకలు.!

మంత్రులు ఆఫీసులకే పరిమితం కావొద్దు

Share this :

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu Naidu) మంత్రులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ, ఏ సమస్య ఉన్నా సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రులు తక్షణమే చొరవ చూపాలని స్పష్టం చేశారు. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలను పరిశీలించాలని, అవి పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఆయా ఇన్‌ఛార్జ్ మంత్రులే పూర్తి బాధ్యత వహించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రులంతా మరింత ప్రొయాక్టివ్‌గా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

Also Read: ఉదయ్ కృష్ణారెడ్డిపై ఫ్యూచర్ ఏంటి..? కేంద్రం ఎలాంటి టెక్నికల్ నిర్ణయాలు తీసుకోనుంది..?

త్వరలో జరగబోయే భోగాపురం(Bhogapuram) ప్రధాని పర్యటన వివరాలను ఈ సందర్భంగా మంత్రులకు సీఎం వివరించారు. ఆగస్టు 1వ తేదీన పూర్తిగా ప్రధాని కార్యక్రమ విజయవంతంపైనే నిమగ్నం కావాలని అధికారులను, మంత్రులను ఆదేశించారు. ఈ పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అందించే నేతన్న భరోసా.. పథకంపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు.

Also Read: రోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!

గత ప్రభుత్వంలో కొందరు అనర్హులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని పలువురు మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, ఈసారి ఎలాంటి తప్పులకు తావులేకుండా కేవలం నిజమైన, అర్హులైన నేతన్నలకు మాత్రమే ఈ పథకం అందేలా చూడాలన్నారు. ఏ ఒక్క అర్హుడికి కూడా నష్టం జరగకుండా పారదర్శకంగా పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో ప్రతిపక్షాల తీరుపై మంత్రులు సీఎంకు వివరించారు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలకు, ఢిల్లీలో జరిగే ఆందోళనలకు ముడిపెడుతూ వివాదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మంత్రులు తెలిపారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. లేని వివాదాలను సృష్టించడమే గొడ్డలి పార్టీ నైజమని విమర్శించారు. వారి కుట్రల పట్ల మంత్రులు, నేతలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.