వైఎస్ షర్మిలకు సర్జరీ.. కనీసం పలకరించని జగన్..!

అన్నతనం ఇదేనా జగన్..?

Share this :

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరడం, ఆమెకు అత్యవసరంగా ఆపరేషన్ జరగడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా ఆమె ఎక్కడా యాక్టివ్‌గా కనిపించకపోవడంతో రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే, కడుపునొప్పి కారణంగా తను ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని, వైద్యులు సర్జరీ చేశారని స్వయంగా షర్మిల సోషల్ మీడియా వేదికగా ఫొటోలను పంచుకుంటూ స్పష్టత ఇచ్చారు. ఆసుపత్రి బెడ్‌పై అచేతనావస్థలో ఉన్న ఆమె ఫొటోలను చూసి కాంగ్రెస్ శ్రేణులతో పాటు వేలాది మంది నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Also Read: ఇండియా కూటమి ఎమర్జెన్సీ మీటింగ్.!

అయితే, ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తోడబుట్టిన సొంత చెల్లి అంత పెద్ద ఆపరేషన్ చేయించుకుని హాస్పిటల్ బెడ్‌పై ఉంటే.. జగన్ నుంచి కనీస స్పందన కరువైంది. నిత్యం రాజకీయ వ్యూహాల్లో నిమగ్నమయ్యే జగన్, కనీసం మానవతా దృక్పథంతో షర్మిల త్వరగా కోలుకోవాలంటూ ఒక సోషల్ మీడియా పోస్ట్ కూడా పెట్టకపోవడం వైఎస్సార్ అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జగన్ అనుచరులు ఆయనను ఎంతగా ఎలివేట్ చేసినా.. సొంత కుటుంబ సభ్యురాలి ఆపద సమయంలో ఆయన చూపిన మౌనం ఆ విశేషణాలన్నింటినీ ప్రశ్నార్థకం చేస్తోందనే వాదన వినిపిస్తోంది.

Also Read: ట్రబుల్ షూటర్ ను కాదని నడ్డాను నమ్మిన మోడీ..!

రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా, ఆస్తుల గొడవలు నడుస్తున్నా.. ఇలాంటి క్లిష్ట సమయంలో రక్తసంబంధాన్ని పక్కనపెట్టడం దారుణమని నెటిజన్లు చాలా బోల్డ్‌గా కామెంట్లు పెడుతున్నారు. “సొంత చెల్లి బాగోగులే పట్టించుకోని జగన్, ఇక రాష్ట్ర ప్రజలను ఏం పట్టించుకుంటారు?” అంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఎల్లప్పుడూ బంధాలకు ఇచ్చే విలువను అభిమానులు గొప్పగా చెప్పుకునేవారని, కానీ జగన్ వైఖరి వల్ల ఇప్పుడు ఆ ఇమేజ్ దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తన పంతాలను వీడి, ఒక పెద్ద అన్నగా షర్మిలను పరామర్శించి తన ‘అన్న’తనాన్ని నిరూపించుకోవాలని సామాన్య జనం అభిప్రాయపడుతున్నారు.