తాజా వార్తలు

Telangana To AP: తెర ముందు ఆర్టిస్టులు.. తెర వెనుక మాజీలు

తెలంగాణ సెంటిమెంట్‌ను పిచ్చి

Share this :

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను తిట్టేందుకే.. ఆ 20 మందిని ఒక వేదిక పై, ఆ ఇద్దరు మాజీ సీఎంలు నిలబట్టారేమో..! ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నంత కాలం అధికారంలోకి రాలేమని తెలుసుకున్న మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణలో ప్రాంతీయ చిచ్చు పెట్టి, రేవంత్ రెడ్డికి పూర్తి మద్ధతిస్తున్న రెడ్డి కులంలో చిచ్చుపెట్టి, వారిని రెచ్చగొట్టి, విడగొట్టి.. మళ్ళీ కేసీఆర్‌ను సీఎం చేయాలనే కుట్రతో కొందరిని తెర పైకి తెచ్చారు. అందుకు నిదర్శనం ఏమిటంటే.. ప్రతి శనివారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు..? వారికి ఇక్కడేమి పని..? వారిద్దరిని నిలదీస్తున్న, కొందరు ప్రబుద్ధులు.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విషయంలో మౌనం వహించటమే అందుకు కారణం.

అసలు విషయం ఏమిటంటే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా, అధికారంగా ఎదుర్కోలేక వారిద్దరిని అన్ని విధాలుగా బద్నాం చేసేందుకు హైదరాబాద్‌లో కుట్ర ప్రారంభం అయ్యింది. తెర ముందు ప్యాకేజ్ ఆర్టిస్టులు.. తెర వెనుక మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ హస్తం ఉందనే మాట బహిరంగ రహస్యం. ప్రాంతీయ సెంటిమెంట్‌తో పాటు కులాల వ్యతిరేకతల కుట్ర కూడా హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారుడు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అనే ప్రచారం జరుగుతోంది. ఇక జర్నలిస్టుల ముసుగులో కొందరు, మేధావుల ముసుగులో మరికొందరు.. సుమారు 20 మంది ఈ కుట్రలో పాలు పంచుకుంటూ భాగస్వాములు అయ్యారు.

కొందరికి ప్యాకేజ్ అందుతుందట.. వీరందరి పనేమిటి..? అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ఆపాలి. ఒక వైపు జగన్ కోసం పని చేస్తూ తెలంగాణలో సెంటిమెంట్ రెచ్చగొట్టాలి.. మళ్ళీ కేసీఆర్‌ను సీఎం చేయాలి.. వైసీపీని సమర్ధవంతంగా ఎదుర్కుంటున్న టీడీపీ సోషల్ మీడియాతో పోటీపడలేక చేతులు ఎత్తేసి వీళ్లను, వాళ్ళను ఉసిగోల్పడం. చంద్రబాబు ఉన్నంత కాలం.. ఎవరికి అంత రేంజ్‌లో పేరు రాదు అని ఫిక్స్ అవ్వటం.. ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ప్రాంతీయవాదం, ఆంధ్రకు కులవాదం ముఖ్యం అని.. అందరూ అనుకుంటారు. అది కరెక్ట్ కానే కాదు. తెలంగాణలో కులాంతర వివాహాలు చాలా తక్కువ. ప్రాంతీయవాదమే ఎక్కువ.

ఆంధ్ర పేరు చెప్పుకుని బతికే వాళ్లకి వాళ్ళ అస్తిత్వం ఏంటో గుర్తు చేయాలి.! తెలంగాణలో కులం పిచ్చి ఉన్నప్పటికి, అది అంతగా బయటపడదు. కులం, తెలంగాణ సెంటిమెంట్‌ను పిచ్చిగా మారుస్తున్నారు. ఆంధ్రపదేశ్‌లో కులం పిచ్చి, కులాల వ్యతిరేకతలు 2024 ఎన్నికల్లో పనిచేయక పోవటంతో.. ఇప్పుడు కులం, మతం, కులం వ్యతిరేకతలను రెచ్చగొడుతున్నారు. ముందుగా కాపు కులంలో చిచ్చు పెట్టేందుకు ప్రారంభించిన కుట్రల ప్రభావం పనిచేయటం లేదు. అందుకే జగన్ అండ్ కో హైదరాబాద్‌కు మకాం మార్చారు. తాము అధికారంలోకి రావాలంటే, ముందు కేసీఆర్‌ను సీఎం చేయాలనేది జగన్ రెడ్డి ఆలోచనగా కనిపిస్తోంది.